Vastu Tips : సాధారణంగా మన రోజువారి జీవితంలో ఉద్యోగం విషయంలో కావొచ్చు, బయటి పనుల విషయంలో కావొచ్చు అప్పుడప్పుడు కొంచెం ఒత్తిడికి గురి అయ్యి మనశ్శాంతిని కోల్పోతూ ఉంటాం. కానీ బాయట ఎన్ని జరిగిన ఎవరైనా కోరుకునే విషయం ఏంటంటే ఇంట్లో మాత్రం ప్రశాంతంగా కుటుంబ సభ్యులతో ఉండాలి అని. కానీ ఇంట్లో పదే పదే ఇబ్బందులు తలెత్తుతున్నాయా ? కుటుంబ సభ్యుల ఆరోగ్యం సరిగ్గా ఉండట్లేదా? అయితే ఒకసారి మీ ఇంటి వాస్తు గురించి మీరు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంట్లో ప్రతికూల వాతావరణం ఉన్నట్లయితే.. వాస్తు ప్రకారం అలా జరగడానికి మనం కూడా కొంతమేర బాధ్యులం అవుతాం. ఈ నేపథ్యంలో వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో ప్రతికూల శక్తికి కారణమయ్యే 5 అంశాలేంటో మీకోసం ప్రత్యేకంగా..
పాత వస్తువులు..
వాస్తు శాస్త్రం ప్రకారం విరిగిపోయిన పాత వస్తువులను లేదా విరిగిన వస్తువులు చాలా అశుభంగా పరిగణిస్తారు. కొంతమంది విరిగిన వస్తువులను ఎక్కువ కాలం పాటు ఉంచుకుంటారు. తర్వాత ఎప్పుడో ఉపయోగించుకోవచ్చని భావిస్తారు. అయితే ఈ ఆలోచన సరైంది కాదు. ఇలా చేయడం ద్వారా మీరు ప్రయోజనాన్ని పొందేలరు. విరిగిన వస్తువులను వెంటనే తొలగించాలని సూచిస్తున్నారు.
మురికిగా ఉండటం..
ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలంటే ఇల్లు శుభ్రంగా ఉండాలి. అలా కాకుండా దుమ్ము, ధూమి, మురికి ఉన్నట్లయితే ప్రతికూలత ప్రవేశిస్తుంది. వీలైనంత వరకు ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అప్పుడే ఆ ఇంటిలో సంపద ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
సాలెగూడు..
వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో సాలే గూడు ఉండటమనేది మానసిక గందరగోళానికి కారణమవుతుందని చెబుతున్నారు. అంతే కాకుండా ప్రతికూల శక్తిని ప్రోత్సహిస్తుందని.. దీంతో సాలే గూడు ఇంట్లో ఉండటం వల్ల లక్ష్మీ దేవి ఉండదని భావిస్తున్నారు. అందుకే వీలైనంత వరకు ఇంట్లో సాలెగూడు లేకుండా చూడాలని అంటున్నారు.
ఈ అంశాలే ఇంట్లో అశాంతికి కారణమా (Vastu Tips)..
ఎండిన మొక్కలు..
ఇంటిని ఏ ప్రదేశంలోనైనా పొడి మొక్కలు ఉంచకూడని గుర్తుంచుకోండి. ఎండిన మొక్కలు ప్రతికూల ప్రభావాన్ని సూచిస్తాయి. అంతేకాకుండా మీ ఇంట్లో మొక్కలు ఎండిపోతుంటే వెంటనే దాన్ని తీసివేసి పక్కకు విసిరేయండి. అంతేకాకుండా ఆ స్థానాన్ని పచ్చని మొక్కతో భర్తీ చేయండి. వాడిన మొక్కలు శని ప్రభావాన్ని పెంచుతాయి. పొరపాటున కూడా ఇంట్లో ఎండిన లేదా వాడిపోయిన మొక్కలను ఉంచకండి.
సామాన్లు చిందరబందరగా ఉండడం..
కొంతమంది తమ వస్తువులను ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తుంటారు. బట్టలు అస్తవ్యస్తంగా ఉంచుతారు. ఇలా ఉంటే అలాంటి వ్యక్తుల జీవితం కూడా అస్తవ్యస్తంగా ఉంటుంది. వాస్తుశాస్త్రం ప్రకారం అస్తవ్యస్తంగా వస్తువులు ఉండే ఇంట్లో ప్రతికూల శక్తి ఎక్కువగా ఉంటుందని.. అలాంటి వ్యక్తులు ఏ పనిని పూర్తి చేయలేరని అందుకే ఆ పద్ధతిని మార్చుకోవాలని అంటున్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/