Vastu Tips : సాధారణంగా గొడవలు పడని భార్యాభర్తలు ఉంటారా అంటే.. కొంచెం సేపు ఆలోచించుకొని సమాధానం చెప్పాల్సిన విషయమే ఇది అని అందరం అనుకుంటాం. ఎందుకంటే వైవాహిక జీవితంలో ఆలుమగలకి మధ్య గొడవలు అనేవి సర్వసాధారణం. కలహాలు లేని కాపురం అంటూ ఉండదు అని పెద్దలు చెప్పే మాటలు నిజమే అని అందరూ చెబుతూ ఉంటారు. అయితే వ్వటన్నింటిని దాటుకొని కలిసి జీవనాన్ని.. జీవిత ప్రయాణాన్ని కొనసాగించడమే ఆ బంధానికి మనం ఇచ్చే విలువ. అయితే పెళ్లికి ముందు ఇరువురి మధ్య ప్రేమ ఉండేదని, తర్వాత దానిస్థానంరో గొడవలు, మనస్పర్థలు వస్తున్నాయని అంటుంటారు. వాస్తవానికి వివాహం తర్వాత స్త్రీలు, పురుషులు బాధ్యతల్లో చిక్కుకుపోతారు.
ప్రేమించుకోవడానికి, రొమాంటిక్ గా గడపడానికి తగిన సమయం దొరకదు. ఈ పరిస్థితిలో ఇద్దరి మధ్య కొంత మేర దూరం పెరుగుతుంది. ఫలితంగా సంబంధం దెబ్బతింటుంది. అంతేకాకుండా ఇద్దరి మధ్య దూరం పెరగడానికి వాస్తు లోపాలు కూడా కొన్ని కారణం అవుతాయి అని వాస్తు శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు. బెడ్ రూమ్ లో భార్యభర్తలకు మధ్య గొడవలు జరగకుండా ఉండేందుకు.. ఈ వస్తువులను ఉంచకపోవడం బెటర్.. అవేంటో మీకోసం ప్రత్యేకంగా..
బెడ్ రూమ్ లో ఎక్కువగా ఉంచకూడని వస్తువులు (Vastu Tips) ..
ఎలక్ట్రానిక్ వస్తువులు..
మీ పడకగదిలో వీలైనంత వరకు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు తక్కువ ఉండేలా చూసుకోండి. ఎలక్ట్రానిక్ డివైజ్ లపై రాహువు చెడు ప్రభావం ఉంటుందని నమ్ముతారు. అంతేకాకుండా రాహువు వివాహా జీవితాన్ని విచ్ఛిన్నం చేస్తారు. ఈ సమయంలో ప్రతికూల శక్తి భార్యభర్తల సంబంధాన్ని నాశనం చేస్తుందని విశ్వసిస్తారు. కాబట్టి రాత్రి పడుకునే ముందుకు మొబైల్ ఫోన్లు కూడా మీ గదికి దూరంగా ఉంచి నిద్రపోవడం మంచిదని తెలుపుతున్నారు.
మొక్కలు..
కొంతమందికి మొక్కలంటే అమితమైన ఇష్టం. అందుకే వారు తమ పడకగదిలో కూడా మొక్కలను ఉంచుతారు. వాస్తు ప్రకారం మొక్కలను బాల్కనీలో లేదా ఇంటికి వెలుపల ప్రదేశంలో నాటాలి. మీకు కావాలనుకుంటే పడకగదిలో తాజా గులాబీలను ఉంచవచ్చు.
హింసాత్మక ఫొటోలు..
వాస్తుశాస్త్రం ప్రకారం మీ బెడ్ రూంలో హింసాత్మక సన్నివేశాలు లేదా వాటిని ప్రతిబింభించేలా ఉండే ఛాయచిత్రాలను ఉంచకండి. ఇలా చేయడం ద్వారా మీకు, మీ జీవిత భాగస్వామి మధ్య కొంచెం గ్యాప్ పెరిగే అవకాశముంటుంది అని చెబుతున్నారు.
నలుపు రంగు వస్తువులు..
బెడ్ రూంలో అక్కడక్కడ నలుపు రంగు ఉన్నంత మాత్రాన ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ అధికంగా ఉపయోగించకూడదు. ఈ రంగు మనస్సులో ప్రతికూలతను తీసుకొస్తుంది. ఈ రంగు ఎక్కువగా వాడినప్పుడు మనస్సులో చెడు ఆలోచనలు రావడం ప్రారంభమవుతాయి అని జ్యోతశయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అలానే కొంతమంది పడకగదిలో ఉండే బెడ్ బాక్స్ లో చెత్త చెదారం, వ్యర్థాలను వేయడం తరచూ చూస్తుంటాం. ఇలా మర్చిపోయి కూడా చేయకండి. బెడ్ బాక్స్ లో ఉపయోగపడే వస్తువులను మాత్రమే ఉంచండి. ఉపయోగం లేని వాటిని ఉంచడం మంచిది కాదు. ఇలాంటి అంశాలు గదిలో ప్రతికూల శక్తిని ఉత్పత్తి చేస్తారు. కాబట్టి పాత వస్తువులు లేదా అనవసరమైన వ్యర్థాలను పడకగదిలో పొరపాటున కూడా ఉంచకూడదు అని అంటున్నారు.