Site icon Prime9

Vastu Tips : మన ఇంట్లోని కొన్ని వాస్తు దోషాలు మన అనారోగ్యానికి కారణం అవుతాయని తెలుసా..!

vastu tips to avoid health issues for family members

vastu tips to avoid health issues for family members

Vastu Tips : మన ఇంట్లోని కొన్ని వాస్తు దోషాలు మన అనారోగ్యానికి కారణం అవుతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.  ఈ వాస్తు దోషం వల్ల ఇంట్లో కుటుంబ సభ్యులు రోగాల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు మరి ఆ వాస్తు దోషాలేంటో.. వాటిని ఎలా పరిష్కరించుకోవాలో మీకోసం ప్రత్యేకంగా..

దక్షిణ దిశ..

దక్షిణ దిశను తెరిచి ఉంచడం లోపంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఈ దిశను యమరాజు దిశగా పరిగణిస్తారు. అంతేకాకుండా ఈ దిశను తెరవడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రసరిస్తుంది. ఇంట్లో ముసలివారిపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. ఫలితంగా వారు అనారోగ్యానికి గురవుతారు. అంతేకాకుండా చాలా సందర్భాల్లో అకాల మరణం చెందిన దాఖలాలు కూడా ఉన్నాయి. కాబట్టి దక్షిణి దిశను మూసి ఉంచాలి.

​మంచం కింద..

మీరు అనుకోకుండా బూట్లు, చెప్పులు లేదా ఇతర విరిగిన వ్యర్థ వస్తువులను మంచం కింద ఉంచుతున్నట్లయితే వీలైనంత తొందరగా ఆ అలవాటును మానుకోండి. ఎందుకంటే ఇలా చేయడం ఎంతో చెడ్డదిగా పరిగణిస్తారు. అంతేకాకుండా మర్చిపోయి కూడా మంచం కింద చెత్తను ఉంచకూడదు. కాబట్టి ఈ స్థలాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే మీ ఇంట్లో ప్రతికూల శక్తి తొలిగి సానుకూల శక్తి ప్రసరిస్తుంది.

​బహిరంగ ప్రాంగణం..

వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి మధ్య భాగాన్ని బ్రహ్మ స్థానంగా పరిగణిస్తారు. పాత రోజుల్లో ఇళ్లు మధ్యస్థానంలో బహిరంగా ప్రాంగణం ఉండేది. కానీ నేటి కాలంలో ఇళ్లు చిన్నవి కావడం వల్ల బహిరంగ ప్రాంగణం నిర్మించడం సాధ్యమవడం లేదు. ఒకవేళ మీ ఇంట్లో ఈ ప్రదేశం లేకపోతే ఇంటికి ఉత్తరం లేదా తూర్పు వైపున బహిరంగ ప్రాంగణాన్ని నిర్మించుకోవాలి. అంతేకాకుండా ఈ బ్రహ్మ స్థలాన్ని అణచివేసి ఉండకూడదు. ఒకవేళ ఈ విధంగా ఉంటే వ్యాధులను ఆహ్వానించడంతో సమానం. అలాగే భారీ వస్తువులను ఇంటి మధ్యలో ఉంచుకోకూడదని గుర్తించాలి. ఇలా చేయడం ద్వారా సానుకూల శక్తి అడ్డంకిగా మారుతుంది. ఫలితంగా ఇంటి సభ్యులకు వ్యాధులు వచ్చే అవకాశముంది.

​పూజా మందిరం..

ఈశాన్య దిశను తెరచి ఉంచడం చాలా ముఖ్యమైన అంశం. ఈ దిశలో చాలా ఇళ్లల్లో పూజా మందిరం ఉంటుంది. అంటే ఈ మూల నుంచి సానుకూల శక్తి ప్రసరిస్తుంది. ఎందుకంటే ఇది దేవతల ప్రదేశంగా పరిగణిస్తారు. అందువల్ల ఈ దిశను మర్చిపోయి మూసివేయకూడదని గుర్తుంచుకోండి. లేకుంటే మీ ఇంట్లో డబ్బు కొరత ఏర్పడుతుంది. అంతేకాకుండా కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలవుతారు. ఇంటి ఈశన్యా దిశ చాలా అందంగా, ఉత్తమంగా ఉండాలి. మర్చిపోయి కూడా ఈశాన్య దిక్కులో ఇంటిని కూల్చకూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో నివసించే ప్రజలు వ్యాధుల బారిన పడే అవకాశముంది. అంతేకాకుండా లైంగిక రుగ్మతలతో బాధపడే అవకాశముంది. అది సంతానోత్పత్తిపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. ఈశాన్యంలో ఉత్తరం వైపు ఎక్కువగా ఎత్తులో ఉంటే.. ఆ ఇంటి మహిళలకు ఆరోగ్య సమస్యలు వస్తాయి. తూర్పు భాగాన్ని పెంచితే పురుషులు ఇబ్బందుల్లో పడతారు.

Exit mobile version