Site icon Prime9

Vastu Tips : బెడ్ రూమ్ లో పెళ్ళైన జంట చేసే ఈ చిన్న తప్పే.. మీ మధ్య గొడవలకు కారణం అని తెలుసా..!

vastu tips for placing dressing table in bed room

vastu tips for placing dressing table in bed room

Vastu Tips : ఇంటికి సంబంధించి దాదాపు ప్రతి ఒక్కరూ వాస్తు నియమాలను పాటిస్తూ రావడం మన పూర్వీకుల నుంచి వస్తున్నదే. కేవలం శాస్త్రోక్తంగా కాకుండానే.. సైంటిఫిక్ గా కూడా వాస్తు నియమాలను పాటించడం వల్ల ఒక పాజిటివ్ ఎనర్జీ  కలుగుతుందని రుజువు అవుతూ వస్తుంది. అలానే వాస్తు నియమాలను పాటిస్తూ ఇంట్లో ఏదైనా వస్తువును ఉంచినట్లయితే ఎప్పుడూ ఆనందం, శ్రేయస్సు ఉంటుందని నమ్ముతారు. అలాగే పడక గదిలో వాస్తు ప్రకారం కొన్ని వస్తువులు ఉండటం అవసరమని వాస్తు శాస్త్రం చెబుతోంది.

పెళ్లి జరిగిన జంట ఉండే బెడ్ రూమ్ లో డ్రెస్సింగ్ టేబుల్‌, వగైరా సామాన్లను సాధారణంగా ఉంచుతాం. అయితే వీటికి క్కూడా కొన్ని వాస్తు నియమాలు పాటించాలి అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అవేంటో మీకోసం ప్రత్యేకంగా..

డ్రెస్సింగ్ టేబుల్ ఎక్కడ ఉంచకూడదు..

దంపతులు ఉండే పడకగదిలో డ్రెస్సింగ్ టేబుల్‌ను బెడ్‌కు ఎదురుగా ఉంచకూడదు.

బెడ్ రూములో డ్రెస్సింగ్ టేబుల్ ని నైరుతి మూలలో ఉంచకూడదు.. దక్షిణ దిశలో ఎట్టిపరిస్థితుల్లోనూ ఉంచకూడదు. ఈ దిశ వైవాహిక జీవితంలో చీలికలను సృష్టిస్తుందని.. ఎటువంటి కారణం లేకపోయినా దంపతుల మధ్య గొడవలు జరుగుతాయని అంటున్నారు.

అలానే బెడ్ రూమ్ లో ఎప్పుడూ డ్రెస్సింగ్ టేబుల్ ను పడమర దిశలో ఉంచకూడదు. అలా ఉంచితే మనసు ప్రశాంతంగా ఉండదని.. చేసే పనిలోనూ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందన్నారు.

డ్రెస్సింగ్ టేబుల్ అద్దం ఉంటే మాత్రం మంచానికి ఎదురుగా ఉంచకూడదు. నిద్రపోతున్నప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ అద్దంలో దంపతుల ప్రతిబింబం లేదా బెడ్ ప్రతిబింబం కనిపించకూడదు. ఇది వివాదాలకు దారి తీస్తుంది.

పడక గదిలో ఓవల్ లేదా గుండ్రని ఆకారపు డ్రెస్సింగ్ టేబుల్‌ను ఉంచడం మానుకోవాలి. అలాంటి ఆకారపు అద్దం ఉన్న డ్రెస్సింగ్ టేబుల్‌ను ఇంట్లో వేరే రూముల్లో పెట్టుకోవచ్చు కానీ పడకగదిలో పెట్టొద్దు.

పడక గదిలో గాజు పగిలిన అద్దాలను, పగిలిన డ్రెస్సింగ్ టేబుల్‌ను ఎప్పుడూ ఉంచకూడదు. ఈ రకమైన డ్రెస్సింగ్ టేబుల్ సంబంధాలలో చీలికలను సృష్టిస్తుంది.

బెడ్రూములో డ్రెస్సింగ్ టేబుల్ ఉంచేటప్పుడు అది నల్లని రంగులో ఉండకూడదని అంటున్నారు. నలుపు రంగులో ఉండే డ్రెస్సింగ్ టేబుల్ వల్ల దంపతుల మధ్య కలహాలు వస్తాయని చెబుతున్నారు.

(Vastu Tips) డ్రెస్సింగ్ టేబుల్ ఎక్కడ ఉంచవచ్చు..

మీ డ్రెస్సింగ్ టేబుల్‌కు అద్దం లేకపోతే ఎక్కడైనా ఉంచవచ్చు.

ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ ఉంచడానికి స్థలం లేకుండా బెడ్రూములో మాత్రమే ఉంచగలం.

బెడ్రూములో ఉంచిన డ్రెస్సింగ్ టేబుల్ కు తూర్పు దిశ అత్యంత అనువైనదని వాస్తు శాస్త్రం చెబుతోంది. డ్రెస్సింగ్ టేబుల్ ను అలా ఉంచితే దంపతుల మధ్య సంబంధాలు బలోపేతం అవుతాయి.

బెడ్రూములో డ్రెస్సింగ్ టేబుల్ ఉంచడానికి చక్కని ప్రాంతం ఉత్తరం వైపు ఉండే గోడ. ఉత్తరం వైపు ఉండే గోడకు డ్రెస్సింగ్ టేబుల్ ఉంచితే అంతా మంచే జరుగుతుంది. దంపతుల మధ్య ఎలాంటి కలహాలు రాకుండా బంధం బలోపేతం అవుతుంది.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version