Vastu Tips : డబ్బు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఆ డబ్బు సంపాదనకు పలు మార్గాలు ఉన్నప్పటికీ ఎక్కువ మంది మాత్రం ఉద్యోగం చేయడానికి ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. ఈ రోజుల్లో ఉద్యోగ జీవితం అంటే.. ఉరుకులు పరుగులతో.. ఒత్తిడి, శ్రమ కలగలిపి ప్రశాంతతకు దూరం అవుతున్నారు. కాగా ఒత్తిడి లేకుండా మానసికంగా ప్రశాంతంగా ఉంటూ, ఉత్సాహంగా పనిచేస్తూ ఉద్యోగంలో ఉన్నత స్థానాలను పొందాలంటే కొన్ని వాస్తు చిట్కాలు ఉన్నాయని శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఈ చిట్కాలు కనుక పాటిస్తే ఉద్యోగంలో ఉన్నత స్థానానికి వెళ్లటానికి మార్గాన్ని సుగుమం చేస్తాయని అభిప్రాయపడుతున్నారు. ఈ చిట్కాలు పాటించినట్లయితే ఇంక్రిమెంట్ ప్రమోషన్ తప్పకుండా వరిస్తుంది. ఆ చిట్కాలేంటో చూద్దాం..
పెద్దల ఆశీర్వాదం..
సమస్త సంతోషాలు, శ్రేయస్సులు తల్లిదండ్రుల పాదాల చెంతనే ఉంటాయని అంటారు. ఇంట్లో నుంచి ఆఫీస్ కు బయలుదేరినప్పుడు మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడం మర్చిపోవద్దు. ఇలా చేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ అభివృద్ధి చెందుతుంది.
ఆకుపచ్చ మొక్క..
మీ ఆఫీసు టేబుల్‌పై ఒక చిన్న పూలమొక్క ఉన్న కుండ ఉంచండి. అందులో సతత హరిత మొక్కను నాటండి. ఇలా చేయడం వల్ల జీవితంలో పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది. కుండలో మొక్క ఎండిపోకుండా చూసుకోవాలి.. అలానే డెస్క్ పై ఏర్పాటు చేసిన మొక్కకు ముళ్లు ఉండకూడదని గుర్తుంచుకోండి.
ఆఫీసు సీటింగ్ దిశ (Vastu Tips)..
ఆఫీసులో మీరు కూర్చుండే దిశ మీ అదృష్టాన్ని తెలియచేస్తుంది. వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం, జీవితంలో విజయం సాధించడానికి ఉత్తరం, పడమర లేదా తూర్పు ముఖంగా కూర్చోవడం శుభప్రదంగా పరిగణిస్తారు. అయితే పొరపాటున కూడా దక్షిణం వైపుగా కూర్చోకూడదు. ఇది మృత్యుదేవత యమధర్మరాజు దిక్కుగా పరిగణిస్తారు.
డస్ట్‌బిన్..
వాస్తు శాస్త్రం ప్రకారం, మీరు మీ టేబుల్ కింద డస్ట్‌బిన్‌ను ఉంచకూడదు. ఇలా చేయడమంటే దుష్టశక్తులను ఆహ్వానించడమే. కాబట్టి మీ డస్ట్‌బిన్ కింద నుండి దాన్ని తీసివేయండి. మీరు దీన్ని చేయలేకపోతే, కనీసం ప్రతిరోజూ శుభ్రం చేసుకోండి, తద్వారా దానిలో మురికి, చెత్త ఉండదు.
పక్షులకు ఆహారం, నీరు..
ఇంటి పైకప్పుపై పక్షులకు ఆహారం, నీరు ఉంచండి.. అలా చేస్తే కెరీర్ పరంగా మీరు ముందుకు సాగడానికి బాగుంటుందని చెబుతున్నారు. ఆకాశంలో ఎగిరే పక్షులలో దేవతలు, నివసిస్తారని పెద్దలు చెబుతుంటారు. అందుకే వాటికి భోజనం, నీళ్లు ఏర్పాటు చేసి ఆ వ్యక్తికి పూర్తి ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం. మీరు కూడా ఉద్యోగంలో మంచి జీతంతో ప్రమోషన్ కోరుకున్నట్లయితే పక్షులకు ఆహారం, నీరు అందించండి.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/