Vastu Tips : మనం నిద్ర లేచిన సాధారణంగా చేసే పని ఏంటంటే.. మనకి బాగా నచ్చిన వాళ్ళ ముఖం చూస్తాం. లేదా కొంతమంది తమ చేతులను చూసుకొని ప్రార్ధించుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. ఉదయం లేవగానే కొన్ని రకాల వస్తువులను చూడడం మంచిది కాదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అంతేకాక ఇవి మన మానసిక పరిస్థితిపై ప్రభావం చూపి, ప్రతి విషయంలో వెనకడుగు వేసేలా చేస్తాయంట. ఈ క్రమంలోనే ఉదయం లేవగానే ఏయే వస్తువులను చూడకూడదో, ఏవి చూడాలి.. ఏయే పనులు చేయకూడదో మీకోసం ప్రత్యేకంగా..
నిద్ర లేచిన వెంటనే ఏం చూడకూడదు అంటే..?
- ఉదయం లేచిన వెంటనే విరిగిన పాత్రలు, పనిచేయని గడియారం చూడడం మంచిది కాదు. ఉదయాన్నే వీటిని చూడడం వలన మీ రోజంతా సరిగ్గా పనిచేయదని వాస్తు నిపుణులు అంటున్నారు.
- అలాగే ఉదయాన్నే సూది, దారాలు, నూనె పాత్రలు చూడకూడదు. వీటిని అపశకునంగా భావిస్తారు.
- ఉదయం మీ నీడను కూడా చూసుకోవడం కూడా మంచిది కాదు. పడమటి దిశ నుంచి నీడను చూస్తే.. రాహు ప్రభావాన్ని చూపిస్తుంది. ఒకవేళ ఆకస్మాత్తుగా నీడను చూస్తే.. తులసి ఆకులను తినాలి.
- రాత్రి వంట చేసిన వస్తువులను చూడకూడదు. ఒకవేళ చూస్తే ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి.
- కొంతమంది తమ ఇళ్లలో జంతువుల చిత్రాలను పెట్టుకుంటారు. అయితే ఉదయం నిద్రలేవగానే వాటిని చూడకూడదు. ఒకవేళ వాటిని చూస్తే ఆ రోజంతా వివాదాలు, గందరగోళాలతో గడిచిపోతుందట. అందుకనే మీరు మీ గదిలో ఏ జంతువు చిత్రాన్ని ఉంచకపోవడమే మంచిదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
(Vastu Tips) నిద్ర లేచిన వెంటనే ఏం చూస్తే మంచిదంటే..?
అర చేతులు..
మీరు ఉదయం లేవగానే మీ అరచేతులను చూడాలి. ఎందుకంటే వ్యక్తి అదృష్టం వారి అర చేతుల్లోనే దాగి ఉంటుందట.
దేవుడి ఫోటోలు, నచ్చిన వారి ఫోటోలు..
చాలా మందికి దేవుడి ఫోటోలను, బాగా నచ్చిన వారి ఫోటోలు చూసుకోవడం అలవాటుగా ఉంటుంది. ఇది కూడా వాస్తు ప్రకారం మంచిదని అంటున్నారు. ఇందువల్ల మనలో ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుందని చెబుతున్నారు.
సుమంగళిని చూడడం..
తెల్లవారుజామున, సుమంగళిని చూడడం లేదా ఆమె చేతిలోని పూజా పళ్ళెన్ని చూస్తే, అది కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది.
అద్దం..
వాస్తు ప్రకారం ఉదయం లేచిన వెంటనే అద్దంలో చూసుకుంటే చాలా మంచిది అని సూచిస్తున్నారు. దీని వల్ల నెగటివ్ ఎనర్జీని తొలగించి.. పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తుందని చెబుతున్నారు. కానీ మీరు అద్దంలో చూసే ముందు ఒకసారి మీ ముఖాన్ని కడుక్కుని ఆ తర్వాత అద్దంలో చూసుకోవడం ముఖ్యం.