Vastu Tips : సాధారణంగా మన దేశంలో హిందూ సాంప్రదాయాలను ఎక్కువగా పాటించేవారు ఎక్కువగా ఉన్నారనే చెప్పాలి.
కాగా హిందువులు వాస్తు శాస్త్రానికి ముఖ్య ప్రాముఖ్యతని ఇస్తూ ఉంటారు.
ఇంటి నిర్మాణంలో, ఇంట్లో ఉండే వస్తువుల విషయంలో వాస్తు నియమాలను ఎక్కువగా పాటిస్తూ ఉంటాం.
ముఖ్యంగా ఏ దిశలో ఏ వస్తువు ఉండాలి.. ఏవి ఉండకూడదు వంటివి వాస్తు ప్రకారం ఫాలో అవుతూ ఉంటాం.
అప్పుడే మీ ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశించి, మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతూ ఉంటారు.
ఈ మేరకు వాస్తు నియమాలను పాటించేలా మనం ఇంట్లో కొన్ని రకాల ఫోటోలను కూడా పెట్టుకోకూడదు అని సూచిస్తున్నారు. అవేంటో మీకోసం ప్రత్యేకంగా..
నీటిలో మునిగే ఫోటోలు (Vastu Tips)..
వాస్తు శాస్త్రం ప్రకారం, ఏదైనా వస్తువు నీటిలో మునిగిపోతున్నట్లు ఉండే ఫోటోలను కూడా ఇంట్లో ఉంచకూడదని సూచిస్తున్నారు. ఈ రకమైన అశుభ ఫలితాలను ఇస్తాయని హెచ్చరిస్తున్నారు. వీటి కారణంగా కుటుంబ సభ్యుల మధ్య వైరం ఏర్పడి.. కలహాలు కలుగుతాయని భావిస్తున్నారు.
తాజ్ మహల్..
తాజ్ మహాల్ ను ప్రేమకు ప్రతీకగా పరిగణిస్తారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం, తాజ్ మహాల్ ఫొటోను పొరపాటున కూడా ఇంట్లో పెట్టుకోకూడదు. ఎందుకంటే తాజ్ మహాల్ అంటే సమాధి. ఇలాంటి ఫొటో పెట్టుకోవడం వల్ల అశుభ ఫలితాలొస్తాయని శాస్త్రాలలో పేర్కొనబడింది. ఈ ఫొటో ఇంట్లో ఉంటే ప్రతికూల శక్తులు ప్రవేశించే అవకాశం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.
(Vastu Tips) జలపాతం..
అందమైన ప్రకృతిని ఇష్టపడని వారంటూ ఉండరు. అందుకే అందమైన జలపాతాలు, ప్రకృతి అందాలను ప్రతిబింబించే ఫొటోలను ఇంట్లో ఉంచుతారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం జలపాతం ఫొటోలను ఇంట్లో ఉంచకూడదని అంటున్నారు. ఎందుకంటే ఈ చిత్రాలు మీ ఇంట్లోని ఆర్థిక పరిస్థితులపై ప్రతికూల ప్రభావం చూపుతాయట. వీటి లాగానే డబ్బులను కూడా నీళ్లలా ఖర్చు చేస్తారని.. ఖర్చులు పెరిగిపోతాయని తెలుపుతున్నారు.
అదే విధంగా క్రూరమైన జంతువుల ఫోటోలను కూడా ఉంచుకోకూడదు అని తెలుస్తుంది. వీటి వల్ల మీ ఇంట్లో హింస పెరిగే అవకాశం ఉందని.. ఇంట్లో గొడవలు పెరిగి హింసాత్మక పరిస్థితులుగా మారే అవకాశాలు ఉన్నాయని వివరిస్తున్నారు.
యుద్దం ఫోటోలు..
మనలో చాలా మంది పురాణాలను ఇష్టపడే వారు ఉంటారు. వాటిలో రామాయణం, మహాభారతం గురించి చాలా మందికి తెలుసు. వాటిలో మనకు నచ్చిన వాటిని ఇంటి గోడలపై తగిలిస్తూ ఉంటాం. అయితే యుద్ధం, హింసను ప్రేరేపించే ఫొటోలను ఇంట్లో పెట్టుకుంటే ప్రతికూల సమస్యలు ఎదురవుతాయని.. ఇంట్లోని కుటుంబ సభ్యుల మధ్య గొడవలు పెరుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
ఈ మేరకు ఈ రకమైన ఫోటోలను ఇంట్లో పెట్టుకోకుండా వాస్తు నియమాలను పాటించి సంతోషంగా ఉండాలని వాస్తు నిపుణులు కోరుతున్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/