Vastu Tips : ప్రతి మనిషి జీవితంలో అతి ముఖ్యమైన వాటిలో నిద్ర కూడా ఒకటి. భూమి మీద ఉండే ప్రతి జీవి తప్పకుండా మూడు విషయాలను పాటిస్తున్నారు. వాటిలో ఆకలి, నిద్ర, శృంగారం.. దీన్ని బట్టి అర్దం చేసుకోవచ్చు మనిషికి నిద్ర అనేది ఎంత అవసరమో. శరీరం తగినంత విశ్రాంతి తీసుకుంటేనే అలసట తగ్గి చేయాల్సిన పనులపై పూర్తి ఏకాగ్రత ఉంచగలుగుతారు. అయితే ప్రస్తుతం పరిస్థితుల్లో ఎప్పుడు నిద్రపోతున్నామో, ఎప్పుడు లేస్తున్నామో అనేది వారి వారి అనుకూలతను బట్టి జరుగుతుంది. నిద్రకి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు మీకోసం ప్రత్యేకంగా..
శాస్త్రాల ప్రకారం సాయంత్రం లేదా సంధ్యా సమయంలో నిద్రించకూడదని చెబుతున్నారు. నిద్రించడానికి కనీసం రెండు గంటల ముందు ఆహారం తీసుకోవాలి అని సూచిస్తున్నారు. ఇలా చేస్తే తిన్న ఆహారం సరైన సమయానికి జీర్ణం అయ్యి.. మంచిగా నిద్రపడుతుంది. ఏ రకమైన అనారోగ్య సమస్యలు కూడా మన దరిచేరవని అంటున్నారు. అలానే రాత్రి ఆలస్యంగా నిద్రలేవడం కూడా నిద్రకు భంగం కలిగించేదిగా పరిగణించబడుతుంది. నిద్రించే ముందు కొంచెం ప్రశాంతంగా ఉండి.. తర్వాత వారి ఇష్ట దైవానికి ప్రార్ధించి పడుకోవడం మంచిదని తెలుపుతున్నారు.
అదే విధంగా సరైన నిద్ర పొందాలంటే పడుకునే దిశ కూడా సరిగ్గా ఉండాలి. మీ దిశ సరిగ్గా లేకపోతే జీవితంలో సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. మీ తలని కూడా సరైన దిశలో పెట్టుకొని నిద్రపోవడం వల్ల మీకు మంచి నిద్ర అందించడమే కాకుండా ఆర్థికంగా సంపన్నులను చేస్తుంది. నిద్రపోవాలంటే ఏ దిశ సరైంది? ఆ దిక్కుల వైపు పడుకుంటే ఎలాంటి ప్రయోజనాలుంటాయి? లాంటి విషయాలు మీకోసం..
వాస్తు ప్రకారం దక్షిణ దిశలో తలపెట్టి పడుకోవడం ఉత్తమమైందిగా పరిగణించబడుతుంది. ఈ దిశలో నిద్రించడం వల్ల ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుకోవచ్చని.. మానసిక సమస్యలు కూడా తొలుగిపోతాయని వాస్తు శాస్త్ర నిపుణులు వెల్లడించారు. అలానే ముఖ్యంగా దక్షిణం వైపు మీ పాదాలు పెట్టి అస్సలు పడుకోవద్దు. ఇది ఆధ్యాత్మిక పరంగా అశుభంగా పరిగణిస్తారు. దక్షిణ వైపు తిరగడం ద్వారా అయాస్కాంత ప్రవాహం పాదాల్లోకి ప్రవేశించి తల ద్వారా మీ మానసిక ఒత్తిడిని పెంచుతుందని.. నిద్రను దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు.
దక్షిణం తర్వాత రెండో సరైన దిశ తూర్పు తలపెట్టి పడుకోవడం. దక్షిణాన తలపెట్టి పడుకోవడం సాధ్యం కాకపోతే మీరు తూర్పున తలపెట్టి పడుకుంటే మంచిది. ఇలా చేయడం ద్వారా దేవతల ఆశీర్వాదాలను పొందుతారని నమ్ముతారు. ఇదే సమయంలో ఆ దిశ నుంచి నిష్క్రమణ కారణంగా జీవితాన్ని ఇచ్చే దిశగా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ వైపు పాదాలపెట్టి పొరపాటున కూడా నిద్రించకండి. ఇది ఆధ్యాత్మిక పరంగా అశుభంగా పరిగణించబడుతుంది.
మీ ఇంట్లో మీరు మాత్రమే సంపాదనపరులైతే లేదా మీ ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తే మీరు తూర్పు దిశలో తలపెట్టుకొని నిద్రపోవడం ఉత్తమమైంది. ఈ దిశలో తలపెట్టి నిద్రించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుందని విశ్వసిస్తారు. విద్యార్థులు తూర్పు వైపు తలపెట్టి పడుకోవడం మంచిది. అంతేకాకుండా ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందని సూచిస్తున్నారు.
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/