Today Horoscope: నిత్యజీవితంలో రోజు జరగబోయే విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందుకే ఎక్కువగా ప్రజలు విశ్వసించే విధానం.. జ్యోతిష్యం. రాశుల గ్రహ స్థితిగతులను లెక్కించి ఆ వ్యక్తుల భవిష్యత్తు ఎలా ఉండబోతుందని జ్యోతిష్య పండితులు లెక్కిస్తారు. 12 రాశుల వారి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.
మేషం: మేషరాశి వారు ఒక వ్యవహారంలో ముఖ్య నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యుల సలహాలు పాటించడం మేలు జరుగుతుంది. ప్రారంభించబోయే పనిలో ఆటంకాలు కలిగినా.. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. కొత్త రుణాల కోసం ప్రయత్నిస్తారు. ఉద్యోగాలు, వ్యాపారాలు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది.
వృషభం: బద్దకంతో ఉండవద్దు. బంధువుల సహకారం అందుతుంది. బంధువులతో వివాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్య విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణాలలో మార్పులు జరుగుతాయి. ఆదిత్య హృదయం చదివితే బాగుంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరుత్సాహ పరుస్తాయి. ప్రతిష్టకు మచ్చ తెచ్చేందుకు కొందరు ప్రయత్నిస్తారు.
శివాభిషేకం శ్రేయష్కరం(Today Horoscope)
మిథునం: కొత్త వ్యక్తుల పరిచయం జరుగుతాయి. సమయానికి అనుకూలంగా ముందుకు సాగాలి. అలాంటప్పుడు అనుకున్నవి సిద్ధిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ అంచనాలు తగ్గ ఫలితాన్ని ఇస్తాయి. ప్రశాంతంగా ఉండాలి. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి. ఈశ్వరుని ప్రార్ధించండి.
కర్కాటకం: కర్నాటక రాశి వారు చేపట్టిన పనులు అనుకున్న సమయానికి.. అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. మీ రంగాల్లో ఊహించని ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. ఆర్థిక ప్రగతి మెరుగ్గా ఉంటుంది. కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు. శివాభిషేకం చేయడం మంచి జరుగుతుంది.
సింహం: వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఒడిదుడికలున్నాయి. దూర ప్రయాణాలు చేస్తారు. కలహాలు ఉన్నాయి. శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి కొంతమేర గందరగోళంగా ఉంటుంది.
కన్య: కన్యారాశి వారు విందు , వినోదాల్లో పాల్గొంటారు. భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు. ధన వ్యయం ఉంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు సమయానికి అనుకూలంగా వ్యవహరిస్తారు. గురుధ్యానం వల్ల శుభం కలుగుతుంది.
కొత్త పనులు చేపడతారు(Today Horoscope)
తుల: ఒక శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. నేడు అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. కొత్త పనులు మొదలు పెడతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన, వస్తు లాభాలున్నాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. శని జపం చేసుకుంటే మంచి జరుగుతుంది.
వృశ్చికం: ఈ రాశివారికి మిశ్రమ వాతావరణం ఉంటుంది. చేపట్టిన ముఖ్య వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో చికాకులున్నాయి. చేసే పనుల్లో ప్రణాళికలు అవసరం. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత చికాకు పరుస్తాయి.
ధనుస్సు: స్థిరాస్థి కొనుగోలు లేదా సొంతి ఇంటి నిర్మాణ వ్యహహారాల్లో పురోగతి ఉంటుంది. ఇంట్లో వారితో ఆనందంగా గడుపుతారు. ధనలాభం ఉంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కులదైవాన్ని స్మరించుకోవాలి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.
మానసింగా దృఢంగా..
మకరం: పనితీరు వల్ల ప్రశంసలు పొందుతారు. కుటుంబ అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. మానసింగా దృఢంగా ఉంటారు. రుణాలు చేసే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. లక్ష్మీ అష్టోత్తర శతనామావశి చదవడం మంచిది.
కుంభం: మానసింగా దృఢంగా ఉంటారు. కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తిగా ఉంటాయి. ముఖ్య విషయాల్లో జాగ్రత్తలు అవసరం. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈశ్వర సందర్శనం వల్ల మేలు కలుగుతుంది.
మీనం: ఈ రాశి వారు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రుతో ఆనందంగా గడుపుతారు. భూవివాదాలు పరిష్కారం అవుతాయి. పలుకుబడిన వ్యక్తుల పరిచయాలు అవుతాయి. ఆకస్మి ధనలాభం ఉంటుంది. ఉద్యోగాలు, వ్యాపారాల్లో చిక్కులు వీడతాయి. విష్ణు ఆరాధన శ్రేయస్కరం.