Site icon Prime9

Solar Eclipse 2022: సూర్యగ్రహణం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో మూతపడనున్న ఆలయాలు

Temples

Temples

Solar Eclipse: తెలుగు రాష్ట్రాల్లో సూర్య గ్రహణం కారణంగా ఆలయాలన్నీ మూతబడనున్నాయి. సూర్య గ్రహణం సాయంత్రం 5 గంటల నుంచి 6.30 గంటల వరకూ కొనసాగుతుందని, అర్చకులు చెబుతున్నారు. అయితే ఒక్కొ ఆలయం ఒక్కో సమయంలో దర్శనాలను రద్దు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం ఉదయం 8 గంటల నుంచి 7.30 గంటల మూసి వేస్తామని, గ్రహణం అనంతరం తర్వాత భక్తులకు సర్వదర్శనం కల్పిస్తామని టీటీడీ తెలిపింది. సూర్యగ్రహణం కారణంగా అన్ని బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.

ఇక విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై వెలసిన కనక దుర్గమ్మ అమ్మవారి ఆలయం సైతం సూర్యగ్రహణం కారణంగా మూతపడనుంది. కేతు గ్రహ పాక్షిక సూర్యగ్రహణం కారణంగా ఆలయాన్ని ఉదయం 11 గంటలకు మూసి వేస్తామని అధికారులు తెలిపారు. గ్రహణం అనంతరం సంప్రోక్షణం చేసి రేపు ఉదయం భక్తులకు దర్శనం కల్పిస్తామన్నారు. మరో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం సైతం గ్రహణం కారణంగా ఉదయం 6 గంటలకే దర్శనాలను రద్దు చేశారు. తిరిగి సాయంత్రం 6.30గంటలకు భక్తులకు దర్శనాలు కల్పిస్తామని అధికారులు తెలిపారు. సాయత్రం ఆలయ సంప్రోక్షణం, శుద్ది అనంతరం రాత్రి 8 గంటలకు భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తామన్నారు. అన్నప్రసాద వితరణతో సహా, అన్ని అర్జిత, శాశ్వత, పరోక్ష సేవలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. కరీంనగర్‌లోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఉదయం 5 గంటలకే మూసి వేయగా తిరిగి సాయంత్రం 7 గంటల తర్వాత భక్తలను దర్శనానికి అనుమతించనున్నారు. అలాగే యాదాద్రిలో సైతం ఆలయాన్ని మూసివేయనున్నారు. ఉదయం 8 గంటల 50 నిముషాలకు మూసివేసి తిరిగి రేపు ఉదయం 10.30 గంటలకు దర్శనాలకు అనుమతిస్తామని అర్చకులు తెలిపారు. సూర్యగ్రహణం కారణంగా ప్రధాన ఆలయాలన్నీ మూతబడుతుండగా, శ్రీకాళహస్తిలోని స్వామి వారి ఆలయం మాత్రం యథావిధిగా తెరుచుకునే ఉంటుందని అధికారులు తెలిపారు. గ్రహణ కాల సమయంలో స్వామి వారికి ప్రత్యేక అభిషేకం నిర్వహిస్తామని, భక్తులకు ఎప్పటిలాగే, రాహు కేతువుల పూజలకు అనుమతిస్తామని తెలిపారు.

ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయాన్ని ఉదయం 11 గంటలకు మూసి వేస్తున్నట్టు అధికారుల తెలిపారు. ఉదయం నుంచి 11 గంటల వరకూ యథావిధిగా దర్శనాలు ఉంటాయని, తర్వాత తిరిగి రేపు ఉదయం స్వామి వారి దర్శనానికి భక్తులను అనుమతిస్తామని తెలిపారు. గ్రహణం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతుందని, అది 6.30 గంటల వరకూ ఉంటుందని, ఆలయ అర్చకులు తెలిపారు. అనంతరం ఆలయంలో సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు దర్శనాలు కల్పిస్తామన్నారు.

Exit mobile version