Site icon Prime9

Sabarimala: ‘ఈ -కానిక’ తో ఎక్కడ నుంచైనా అయ్యప్పకు కానుకలు

Sabarimala

Sabarimala

Sabarimala: అయ్యప్ప భక్తులకు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు శుభవార్త చెప్పింది. ప్రపంచంలో ఎక్కడ నుంచి అయినా శబరి గిరీసుడికి భక్తులు కానుకలు పంపేలా ఈ – కానిక వెబ్ సైట్ ను ప్రారంభించింది. ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్ ఈ వెబ్ సైట్ ను రూపొందించినట్టు ఆలయ బోర్డు అధ్యక్షుడు అనంత గోపాలన్ వెల్లడించారు. ఈ వెబ్ సైట్ అందుబాటులోకి రావడంతో అయ్యప్పగుడికి వచ్చే ఆదాయం పెరుగుతుందని ఆలయ బోర్డు భావిస్తోంది. కాగా, వెబ్ సైట్ ప్రారంభమైన తర్వాత మొదటి కానుకను టీసీఎస్ సీనియర్ జనరల్ మేనేజర్ సమర్పించారు. శబరిమల క్షేత్రాన్ని జూన్ 15న తెరవనున్నారు. ఆ తర్వాత రోజు నుంచి 4 రోజుల పాటు స్వామి సన్నిదానంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి.

 

వచ్చే నెలలో వర్చువల్ క్యూ సేవలు(Sabarimala)

మరో వైపు గతంలో శబరి మల ఆలయ బోర్డు వర్చువల్ క్యూ విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే బుకింగ్ ను మాత్రం కేరళ పోలీసులకు అప్పగించింది. తర్వాత ఈ సేవలను దేవస్థానమే నిర్ణయించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ వర్చువల్ క్యూ బుకింగ్ విధానానికి సంబంధించిన వెబ్ సైట్ పనులను కూడా టీసీఎస్ కు అప్పగిస్తూ ఆలయబోర్డు నిర్ణయం తీసుకుంది. వచ్చే నెలలో ఈ సేవలు కూడా ప్రారంభం కానున్నాయి.

 

భారీగా ఆదాయం

2022లో అయ్యప్ప గుడికి భారీగా ఆదాయం వచ్చింది. దాదాపు రూ. 318 కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్టు ఆలయ బోర్డు అధికారులు వెల్లడించారు. గత ఏడాది వచ్చిన ఆదాయం శబరిమల ఆలయ చరిత్రలోనే అత్యధికమని తెలిపారు. అంతకు ముందు 2018 లో రూ. 260 కోట్ల ఆదాయం సమకూరింది. కరోనా సంక్షోభం తర్వాత గత అయ్యప్ప సీజన్ లోనే భక్తులను పూర్తి స్థాయిలో అనుమతించారు. ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో భక్తులు దర్శనానికి తరలివచ్చారు. దీంతో అధిక ఆదాయం వచ్చింది. ఒక్క కాయిన్స్ రూపంలోనే స్వామి ఆదాయం రూ. 7 కోట్ల వరకు వచ్చిందని అధికారులు వెల్లడించారు. మిగిలిన కానుకలను కలుపుకుని మొత్తం ఆదాయం రూ. 330 కోట్లుగా పేర్కొన్నారు.

 

Exit mobile version
Skip to toolbar