Lord Ganesh News : వినాయకుడు విగ్రహం పెట్టేటప్పుడు తీసుకోవాలిసిన జాగ్రత్తలు :
వినాయకునే విగ్రహం కొనుక్కునే వారు తొండం ఎడమ వైపున ఉండే విగ్రహాలు మాత్రమే కొనుక్కోవాలి.ముఖ్య మైన విషయం ఏంటంటే మట్టి విగ్రహం మాత్రమే తీసుకోవాలి.ప్లాస్టిక్ ను అసలు ప్రిఫర్ చేయకండి.ప్లాస్టిక్ కలిసిన విగ్రహాలను పెట్టడం ద్వారా దీని వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
చవితి రోజున వినాయకుడికి మండపాలు కట్టి మండపాల్లో పూజలు చేస్తారు.వినాయకునికు నిత్య పూజలు చేయాలి. ఉదయం,సాయంత్రం రెండు పూటలా మీరు ఎన్ని రోజులు పూజలు చేస్తే అన్ని రోజులు వినాయకునికి నైవేద్యం పెట్టాలిసిందే.నైవేద్యంలో వినాయకుడికు ఇష్టమైన వంటకాలు కుడుములు,మోదకాలు,లడ్డు ఇలా పలు రకాల పిండి వంటలు చేయాలి.
మనం దేవుడుకు ఎంత భక్తితో వినాయకుడి పూజలు చేస్తామో అదే విధంగా విగ్రహ నిమజ్జనం రోజు మనం అంతే భక్తితో దేవుడును నిమజ్జనం చేసుకుంటాము .నిమజ్జన ఉరోగింపు రోజు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఎందుకంటే నిమజ్జనం రోజు ఉరోగింపులో డప్పులు, డిజె లతో పెట్టి చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు డాన్స్ లు వేసుకుంటూ సందడి సందడిగా దేవుని ఉరోగింపు అనంతరం వినాయకుడును చెరువుల్లో, నదుల్లో , వాగుల్లో , కాలువల్లో ఇలా నిమజ్జనం చేస్తారు.