Bathukamma: వర్షాకాలం ముగింపులో సెప్టెంబర్-అక్టోబర్ మధ్య ప్రతి ఏటా ఈ పండుగ వస్తుంది. ఈ పండుగను తొమ్మిది రోజులు జరుపుకుంటారు. ఈ సంవత్సరం సెప్టెంబరు 25 నుంచి ఈ పండుగ మొదలయ్యింది. ప్రతి ఏడాది అమావాస్య నాడు ఈ బతుకమ్మ పండుగ మొదలవుతుంది. అక్టోబర్ 3 వరకు ఈ బతుకమ్మ పండుగ జరుపుకోనున్నారు. తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ (బతుకమ్మ) తో ఈ పండుగ ముగుస్తుంది. ఈ పండుగ ముఖ్యంగా బతుకమ్మను పూలతో అలంకరించి, ప్రసాదాలతో బతుకమ్మను పూజిస్తారు. తంగేడు పూలు, గునుగు పూలు, గుమ్మడి పూలు, గోరంట్ల పూలు, పేర్చుకుంటూ, పసుపుతో గౌరమ్మను చేసి బతుకమ్మను అలంకరిస్తారు. ఈ పండుగను పల్లెల్లో బాగా జరుపుకుంటారు.
నేడు 29 సెప్టెంబర్ 2022 ఐదో రోజు అట్ల బతుకమ్మ..
ఐదో రోజు అట్ల బతుకమ్మ పండగను జరుపుకుంటారు. ఈ రోజు తంగేడు పూలు, గునుగు పూలు, చామంతి పూలు, గుమ్మడి పూలతో అలకంకరించి బతుకమ్మను పూజిస్తారు. ఈ రోజు పిండితో చేసిన అట్లను నైవేద్యంగా పెడతారు. అందుకే అట్ల బతుకమ్మ అని పేరు. బతుకమ్మ ఆట పూర్తయిన తర్వాత మహిళలందరూ అట్లను ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటారు.