Mutton biryani: గుడిలో ప్రసాదంగా వేడి వేడి మటన్ బిర్యానీ.. అవును మీరు విన్నది నిజమే. గుడిలో ప్రసాదం అంటే పులిహోరా, దద్దోజనం, లడ్డూ, చక్కెర పొంగలి వంటివి ప్రసాదంగా పెడతారు. కానీ ఇక్కడ మాత్రం భక్తులకు వేడి వేడి బిర్యానీని ప్రసాదంగా పెడతారు. ఇది ఎక్కడో తెలుసుకోవాలంటే తమిళనాడులోని మదురైకు వెళ్లాల్సిందే. తమిళనాడులోని మదురై జిల్లా తిరుమంగళం తాలుకా వడక్కంపట్టి గ్రామంలో మునియండి అనే దేవాలయం ఉంది. ఇక్కడ జనవరి వచ్చిందంటే చాలు నోరూరించే మటన్ బిర్యానీని (Mutton biryani) ప్రసాదంగా పెడతారు.
ఈ ఆచారం ఎక్కడో తెలుసా ?
మధురై నగరానికి 45 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ దేవాలయంలో ప్రతి ఏటా జనవరి 24, 25, 26 తేదీల్లో ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. దానిలో భాగంగా 25న ఉదయం 5 గంటలకే మటన్ బిర్యానీని (Mutton biryani) ప్రసాదంగా పెడతారు. అంత పొద్దున బిర్యానీ తినడమే ఇక్కడి ప్రత్యేకత.
ఈ ఆచారం 83 ఏళ్లుగా కొనసాగుతోంది. 2వేల కిలోల బాస్మతి రైస్, దానికి సరిపడా మటన్‌తో బిర్యానీ తయారు చేసి భక్తులందరికీ అందజేస్తారు. అక్కడ దేవుడి పేరు మీద ప్రారంభించిన ‘శ్రీ మునియండి విలాస్’ బిర్యానీ హోటల్ కూడా చాలా ఫేమస్. ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో ‘శ్రీ మునియండి విలాస్’ పేరుతో దాదాపు వెయ్యి బ్రాంచీలున్నాయట.
మూడు రోజుల పాటు ఉత్సవాలు..
ఈ బిర్యానీ ప్రసాదం ఆనవాయితీ ఇటీవల మొదలైంది కాదు. గత ఎనిమిదిన్నర దశాబ్దాలుగా ఇదే పద్ధతి కొనసాగుతోంది. ఏటా జనవరి 24 నుంచి రెండు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు మునియాండి ఆలయానికి వస్తారు. వారి కోసం వెయ్యి కిలోల బియ్యం, 250 మేకపోతులు, 300 కోళ్లతో రుచికరమైన బిర్యానీలు వండుతారు. ఈ రెండు రోజులు అదే ప్రసాదంగా అందిస్తారు. ప్రసాదం కదా.. కొంచెమే పెడతారనుకోవద్దు. ఈ బిర్యానీ ప్రసాదాన్ని పార్శిల్ కట్టించుకుని ఇంటికి తీసుకెళ్లే సదుపాయం కూడా ఉంది. ఓవైపు పూజలు.. వాయిద్యాలు మోగుతుంటే మరోవైపు బిర్యానీ టేస్ట్ చూస్తుంటారు భక్తులు. ఎప్పటిలాగే ఈసారి కూడా ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించనున్నారు. మనమూ ఓసారి వెళ్లి బిర్యానీ రుచి చూసోద్దామా మరి..!
ఇవి కూడా చదవండి:
ఇక వాల్తేరు ’విరాట్‘ ను చూడండి.. కింగ్ కోహ్లి బ్యాక్ ఇన్ యాక్షన్
‘శాకుంతలం’ ట్రైలర్.. కళ్లు చెదిరే విజువల్ వండర్ లో సమంత
నన్ను కార్నర్ చేసే సీన్ ఎవరికీ లేదు.. కానీ నా సినిమా రెండు రోజులు వాయిదా వేసుకున్నాను.. దిల్ రాజు
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news