Horoscope Today: ఈ రాశి వారికి ఒత్తిడి పెరిగే అవకాశం.. సోమవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే!

Horoscope Today: నిత్యజీవితంలో రోజు జరగబోయే విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందుకే ఎక్కువగా ప్రజలు విశ్వసించే విధానం.. జ్యోతిష్యం. రాశుల గ్రహ స్థితిగతులను లెక్కించి ఆ వ్యక్తుల భవిష్యత్తు ఎలా ఉండబోతుందని జ్యోతిష్య పండితులు లెక్కిస్తారు.

Horoscope Today: నిత్యజీవితంలో రోజు జరగబోయే విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందుకే ఎక్కువగా ప్రజలు విశ్వసించే విధానం.. జ్యోతిష్యం. రాశుల గ్రహ స్థితిగతులను లెక్కించి ఆ వ్యక్తుల భవిష్యత్తు ఎలా ఉండబోతుందని జ్యోతిష్య పండితులు లెక్కిస్తారు. 12 రాశుల వారి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.

మేషం: నేడు ఈ రాశివారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడుతాయి. ఆర్ధికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మీ స్నేహితులకు అందినంత సాయం చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ జీవితం సాఫీగా ఉంటుంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు.

ఈ రాశి వారికి ఆర్ధిక పురోగతి

వృషభం: ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి ఉంటుంది. వ్యాపారాల్లో ముందుకు సాగుతారు. నేడు ఆకస్మిక ధన లాభం వచ్చే అవకాశం ఉంది.

ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆకస్మిక ప్రయాణానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది.

మిథునం: వృత్తి వ్యాపారాల్లో ముందుకు సాగుతారు. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా ఉంటుంది.

ఐటీ రంగానికి చెందిన ఉద్యోగులు ఉద్యోగం మారటానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి.

వివాదాలకు ఆస్కారం ఉంది. ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. బంధువర్గంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.

కర్కాటకం: ఈ రాశివారికి నేడు ఆర్ధిక స్థితి బాగుంటుంది. ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారి తీస్తాయి. ఉద్యోగంలో అధికార యోగం పట్టే అవకాశం ఉంది.

కొత్త ఆదాయ మార్గాలను ఆన్వేషిస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయి ఉంటుంది. కుటుంబ విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.

కుటుంబ సభ్యులను కూడా సంప్రదించండి. ముఖ్యమైన పనుల్లో బంధుమిత్రులు సహకరిస్తారు.

సింహం: మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది. పాజిటివ్ గా ఆలోచిస్తే అంతా మంచే జరుగుతుంది. ఆరోగ్యం కొంతవరకు కుదుటపడుతుంది. ఆకస్మిక ప్రయాణం తప్పకపోవచ్చు.

ఉద్యోగంలో ఆటంకాలు ఎదురవుతున్నా పట్టుదలగా లక్ష్యాలు పూర్తి చేస్తారు. బాగా శ్రమ, తిప్పట ఉంటాయి.

కొందరు బంధువుల వల్ల ఇబ్బంది పడతారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది.

కన్య: ఈ రాశివారికి ఆధ్యాత్మిక చింతన అవసరం. ఆర్థికపరంగా, ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

ఉద్యోగంలో అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు. దూర ప్రాంతం నుంచి గుడ్ న్యూస్ వింటారు.

సంతాన యోగానికి సంబంధించి శుభవార్త ఒకటి మీ చెవిన పడుతుంది. అనుకోని విధంగా మొండి బాకీ ఒకటి వసూలు అవుతుంది.

ఒకటి రెండు ముఖ్యమైన పనులు పూర్తవుతాయి.

తుల: ఆర్థిక పరిస్థితుల్లో మార్పు ఉండదు. ఖర్చులు విషయంలో ఇబ్బందులు ఉంటాయి. బంధుమిత్రుల నుంచి ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది.

మొండి బాకీ ఒకటి వసూలు అవుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి వేధింపులు ఉంటాయి. ఉద్యోగరీత్యా ప్రయాణానికి అవకాశం ఉంది.

అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. స్నేహితులు పక్కదోవ పట్టించే అవకాశం ఉంది.

ఈ రాశి వారికి గుడ్ న్యూస్

వృశ్చికం: దూరపు బంధువులతో మంచి వివాహ సంబంధం కుదురుతుంది. అనుకోకుండా అదనపు ఆర్థిక ప్రయోజనాలు మీ ముందుకు వస్తాయి. ఆర్థిక లావాదేవీల్లో ఆచితూచి అడుగు వేయండి. స్పెక్యులేషన్కు దూరంగా ఉండటం మంచిది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ముందుకు వెళతాయి. ఐటీ నిపుణులు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

ధనుస్సు: కుటుంబంలో మనశ్శాంతి తగ్గుతుంది. ఎవరితోనూ వాదోపవాదాలకు దిగవద్దు. స్నేహితులతో కూడా అపార్ధాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల కనిపిస్తుంది. చాలాకాలంగా ఎదురుచూస్తున్న సమాచారం ఒకటి అందుతుంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యం పర్వాలేదు.

మకరం: నేడు ఈ రాశివారు శుభకార్యంలో పాల్గొంటారు. దైవ దర్శనాలు చేసే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ముందుకు సాగుతుంది. పిల్లల విషయంలో శుభవార్త వింటారు. ఉద్యోగంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగం మారటానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. బంధువుల దగ్గర నుంచి డబ్బులు వసూలు అవుతాయి.

కుంభం: విదేశాల నుంచి మంచి కబురు అందుతుంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు చేతికి అందిస్తుంది. బంధుమిత్రులతో సంబంధాలు మెరుగుపడతాయి. సన్నిహితులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. కొద్దిగా ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గం మీ ముందుకు వస్తుంది.

మీనం: ఆదాయంలో మెరుగుదల ఉంటుంది. పని విషయాల్లో శ్రమ ఒత్తిడి ఉంటాయి. ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆకస్మిక ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. బంధు మిత్రుల నుంచి సహాయం అందుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది.