Horoscope Today: జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల వారికి అదృష్టం కలసి రానుంది. అలాగే మార్చి 6 వ తేదీ నాటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
మేషం: ఆధ్యాత్మిక విషయాల మీద ఖర్చు ఎక్కువ చేసే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగానే ఉంటుంది. ఆరోగ్యం విషయంలో ఎలాటి ఇబ్బందులు ఉండవు. తనకు మాలిన ధర్మంగా ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఉద్యోగం విషయంలో పరస్థితులు సానుకూలంగా ఉంటాయి. పని విషయంలో అధికారుల అండదండలు ఉంటాయి. కుటుంబంతో సరదాగా కాలక్షేపం చేస్తారు. పిల్లలు పురోగతి సాధిస్తారు. వ్యాపారులు స్వల్ప లాభాలు గడిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా ముందుకు వెళతాయి.
వృషభం: ఆర్థికపరంగా కొద్దిపాటి అదృష్టం వరిస్తుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. స్నేహితుల నుంచి ఆర్థిక సహాయానికి ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగంలో అధికారులు సహాయం అందిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం విషయంలో ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలలో ముందుకు వెళతారు.
మిథునం: ఒకటి రెండు ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటారు. మొండి బాకీలు కచ్చితంగా వసూలు అవుతాయి. ఉద్యోగ పరంగా ఆర్థిక పరిస్థితి ఈ రాశివారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో కొన్ని ప్రత్యేక బాధ్యతలను అప్పగిస్తారు. వ్యాపారంలో భాగస్వాముల నుంచి సహకారం లభిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. నేడు పలు శుభవార్తలు వింటారు. చదువు విషయంలో విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి.
కర్కాటకం: ఆర్థిక లావాదేవీల వల్ల కొన్ని మంచి ప్రయోజనాలు పొందుతారు. కొందరు మిత్రులను నమ్మి మోసపోయే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్తలు అవసరం. ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో కాస్త ఇబ్బందులు తలెత్తుతాయి. ఆరోగ్యం ప్రస్తుతానికి బాగానే ఉంటుంది కానీ శరీరానికి విశ్రాంతి అవసరం. అదనపు ఆదాయానికి ప్రయత్నాలు సాగిస్తారు. విద్యార్థులకు బాగుంటుంది.
ఈ రాశి వారికి అదనపు ఆదాయం.. (Horoscope Today)
సింహం: నేడు ఈ రాశివారికి అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితులు కొన్ని చక్కబడతాయి. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా గడుస్తుంది. డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు తదితర వృత్తుల వారికి సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఐటీ రంగంలోని వారికి అవకాశాలు పెరుగుతాయి. పిల్లలు చదువుల్లో ముందడుగు వేస్తారు. ఆరోగ్యం పర్వాలేదు.
కన్య: ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరిగా ఉండాలి. బంధువులకు తగిన ఆర్ధిక సాయం చేస్తారు. ఉద్యోగపరంగా జీవితం సాఫీగా సాగిపోతుంది. ముఖ్యమైన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేస్తారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. నిరుద్యోగుల ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగానే ఉంటుంది. దూర ప్రాంతం నుంచి ఆశించిన శుభవార్త వింటారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.
తుల: మనసులోని ఒకటి రెండు కోరికలు నెరవేరుతాయి. వాహన యోగానికి అవకాశం ఉంది. వ్యక్తిగత వ్యవహారాల్లో బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. సంతాన యోగానికి సంబంధించి శుభవార్త వింటారు. ఉద్యోగం విషయంలో మంచి ఆఫర్ అందుతుంది. ఆశించిన స్థాయిలో పిల్లలు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా కొనసాగుతాయి.
వృశ్చికం: సంపాదన కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. కానీ దానికి తగిన విధంగానే ఖర్చులు కూడా పెరుగుతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఆహార విహారాల్లో కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది. ఉద్యోగంలో అధికారులు కారణంగా కొన్ని చికాకులు వచ్చి పడుతాయి. వ్యక్తిగత విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. పిల్లల నుంచి శుభవార్త వింటారు. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి.
ఈ రాశి వారికి ఈ జాగ్రత్తలు అవసరం
ధనుస్సు: కొన్ని సమస్యల విషయంలో జాగ్రత్తలు అవసరం. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. ఆదాయానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మొండి బాకీలను వసూలు చేసే పనిని చేపడతారు. ఉద్యోగ పరంగా చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ పట్టుదలగా లక్ష్యాలను పూర్తి చేస్తారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ప్రేమ వ్యవహారాలు నిరుత్సాహం కలిగిస్తాయి.
మకరం: నేడు ఈ రాశి వారికి ఆశించిన స్థాయిలో సంపాదన పెరిగే అవకాశం ఉంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం చాలా మంచిది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కొద్దిగా ఉపశమనం పొందుతారు. నేడు వాగ్దానాలు చేయడం, హామీలు ఉండటం మంచిది కాదు. పడుకుబడి గల వారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజికంగా హోదా పెరుగుతుంది. ఉద్యోగ జీవితం చాలా వరకు సాఫీగా సాగిపోతుంది.
కుంభం: ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. అయినా కూడా మీకు ఉన్న లక్ష్యాలను పూర్తి చేస్తారు. సహచరుల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. మితిమీరిన ఔదార్యంతో ఇతరులకు సహాయం చేస్తారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. పిల్లలు చదువులలో బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు నత్తనడక నడుస్తాయి.
మీనం: ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. పొదుపు పాటించడం మంచిది. స్నేహితుల వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఉద్యోగ పరంగా బాధ్యతలు పెరిగి శారీరక శ్రమకు గురవుతారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే చిన్నపాటి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఇతరుల వివాదాల్లో తలదూర్చవద్దు. కొందరు బంధువులు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.