Prime9

Free Prasadam in Yadagirigutta: యాదగిరిలో భక్తులకు ఉచిత ప్రసాదం.. రేపటి నుంచే అమలు!

Free Prasadam in Yadagirigutta Temple: భక్తుల సౌకర్యార్థం యాదగిరిగుట్ట దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. యాదగిరి నర్సన్న దర్శనానికి వచ్చే భక్తులకు ఉచితంగా పులిహోర, లడ్డూ పంపిణీ చేయాలని దేవస్థానం భావిస్తోంది. రేపటి నుంచి ఈనెల 30 వరకు ట్రయల్ రన్ నిర్వహించనుంది. అంతా సవ్యంగా జరిగితే.. జూలై 1 నుంచి వారంలో ఆరు రోజులు పులిహోర, శనివారం నాడు పులిహోరతో పాటు లడ్డూ ప్రసాదాన్ని సైతం భక్తులకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు ఈవో వెంకట్ రావు తెలిపారు. ఈ మేరకు వివరాలు వెల్లడించారు.

 

అలాగే యాదగిరిగుట్ట నర్సింహస్వామి ఆలయంలో నిర్వహించే సత్యనారాయణస్వామి వ్రతాల టికెట్ రేట్లను పెంచుతూ దేవస్థానం అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు రూ. 800గా ఉన్న వత్రం టికెట్ రేటును రూ. 1000 కి పెంచుతూ ఈవో వెంకట్ రావు నిన్న ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటివరకు ఉన్న టికెట్ పై పూజా సామాగ్రితో పాటు అవసరమైన పాత్రలు ఇస్తున్నారు. ప్రస్తుతం టికెట్ రేటును పెంచిన నేపథ్యంలో దేవస్థానం పూజా, ఇతర సామాగ్రితో పాటు స్వామివారి శేష వస్త్రాలు (షెల్లా, కనుమ), సత్యనారాయణస్వామి విగ్రహ ప్రతిమ సైతం దేవస్థానం ఇవ్వనుంది.

 

కాగా పెరిగిన టికెట్ ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. మరోవైపు యాదగిరిగుట్ట పరిధిలో నిర్మించిన రింగురోడ్డుకు ఉన్న సర్కిళ్లగా ప్రత్యేకంగా పేర్లను పెట్టాలని అధికారులు నిర్ణయించారు. అందులో భాగంగా వైకుంఠ ద్వారం వద్ద ఉన్న సర్కిళ్ కు అభయాంజనేయస్వామి సర్కిల్, మల్లాపురం వెళ్లే దారిలో ఉన్న సర్కిల్ కు యాదరుషి, ప్రెసిడెన్షియల్ స్కూల్ వద్ద ఉన్న సర్కిల్ కు గరుడ, ఘాట్ రోడ్డు కూడలికి రామానుజ సర్కిల్ గా నామకరణం చేశారు.

 

Exit mobile version
Skip to toolbar