Ganesh Pooja: వినాయక పూజకు మంచి ఘడియలు ఏంటో తెలుసా

కొంతమందికి వినాయకుడి పూజ ఏ సమయానికి మొదలు పెట్టాలి.మనం మొదలు పెట్టె పూజ ఘడియలు మంచివేనా లేక మంచి సమయంలో మొదలు పెట్టాలా..అని ఇలా అనేక సందేహాలు, పలు అనుమానాలు ఉంటాయి.మీ సందేహాలకు మా దగ్గర జవాబులు ఉన్నాయి.

  • Written By:
  • Publish Date - August 31, 2022 / 07:01 AM IST

Ganesh Pooja: కొంతమందికి వినాయకుడి పూజ ఏ సమయానికి మొదలు పెట్టాలి.మనం మొదలు పెట్టె పూజ ఘడియలు మంచివేనా లేక మంచి సమయంలో మొదలు పెట్టాలా..అని ఇలా అనేక సందేహాలు, పలు అనుమానాలు ఉంటాయి.మీ సందేహాలకు మా దగ్గర జవాబులు ఉన్నాయి.

మంచి ఘడియలు :
ఆగస్టు 30 న మంగళవారం మధ్యాహ్నం 2 నుంచి చవితి ఘడియలు మొదలు అవుతాయి.ఆగస్టు 31 అనగా బుధవారం మధ్యాహ్నం 2 గంటల వరకు చవితి ఉంది. తరువాత పంచమి మొదలు అవుతుంది.
వర్జ్యం :
ఆగస్టు 31 న అనగా బుధవారం వర్జ్యం ఉదయం 7 గంటల 55 నిముషాల నుంచి 9 గంటల 31 నిముషాల వరకు ఉంది.
దుర్ముహర్తం:
ఆగస్టు 31 న దుర్ముహర్తం కూడా ఉంది జాగ్రత్త
ఉదయం 11 గంటల నుంచి 35 నిముషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 23 నిముషాల వరకు ఉంది.

వినాయకుడికి పూజ చేసి ముందు వర్జ్యం,దుర్ముహర్తం, మంచి ఘడియలు అన్ని చూసుకునే పూజ ప్రారంభించాలి. మీరు బుధవారం ఉదయం పూజ మొదలు పెట్టుకోవాలంటే 7 గంటల 55 నిముషాలు లోపే మొదలు పెట్టాలి . 11 నుంచి 12 మధ్యలో పూజను మొదలు పెట్టకండి. మీరు పూజ మొదలు పెట్టిన తరువాత ఎప్పుడు మొదలు పెడుతున్నారో అది మాత్రమే చుడుకోవాలి.