Site icon Prime9

Naga Dosham: నాగదోషం పోవాలంటే ఇలా చేయాలి..

naga-dosham

naga-dosham

Naaga Dosh: సర్పాలను హింసించడం వల్ల, చంపడం వల్ల నాగదోషం కలుగుతుంది. నాగదోషము వలన దరిద్రము, గర్భస్రావములు, అంగవైకల్య సంతానము, చర్మ రోగములు, తీవ్రమైన కోపము, తీవ్ర మానసిక ఆందోళన, వెన్నుపూస, నరాల సంబంధ వ్యాధులు మొదలైన చెడు ఫలితాలు పొందవలసిన అగత్యము కలుగుతుంది. ఈ దోష తీవ్రతను తగ్గించుకునేందుకు కొన్ని పరిహారాలను అవలంభించాలి.

నాగదోషం ఉండేవారు నాగులచవితి రోజున నాగారాధనను కనుక చేసినట్లయితే అనేక రకాలైన దోషాలు ముఖ్యంగా రాహు, కేతు సంబంధమైన దోషాలు తొలిగిపోతాయి. ఈ రోజు ఉదయాన్నే మేలుకొని, అభ్యంగన స్నానాన్ని ఆచరించాలి. ఈ రోజంతా ఉపవాసం ఉండాలి. ఆ తర్వాత ఇంట్లో నాగప్రతిమను పెట్టి దానికి అభిషేకాదులు నిర్వహించి, షోడశోపచార పూజను చేసి, నైవేద్యంగా నువ్వులు, బెల్లం కలిపి చేసిన చిమ్మిలి, చలిమిడి దీన్ని బియ్యంపిండి, పాలు కలిపి చేస్తారు. ఇక పండ్లు, ఆవుపాలు, కొంతమంది కోడిగుడ్లను కూడా సమర్పిస్తారు. చవితి నాడు సర్పాలను పూజిస్తే సర్వరోగాలు, వైవాహిక దాంపత్య దోషాలు, గర్భదోషాలు పోయి ఆరోగ్యవంతులవుతారని భక్తులు విశ్వాసంతో పూజిస్తారు. ఎందుకంటే కుజ దోషం, కాలసర్ప దోషానికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలగుతాయి. నాగుల చవితి నాడు నాగేంద్రుని శివునికి వాసుకిగా, విష్ణువుకు ఆది శేషుడుగా తోడు ఉంటాడు కాబట్టి ఈ చవితి రోజు విశ్వాసం గల భక్తుల పూజ నైవేద్యాలను సమర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని విశ్వాసం.

శాంతి పూజల కోసం శ్రీశైలము, శ్రీకాళహస్తి వెళ్లవచ్చు. విశేష పూజలకు మాత్రం కర్ణాటకలోని కుక్కి సుబ్రహ్మేణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లాలి. అక్కడ పిండితో సర్పాకృతిని తయారు చేసి దానికి నాగదోష బాధితులతో పిండప్రదానము, శాంతి పూజలు చేయిస్తారు.

Exit mobile version
Skip to toolbar