Devotional News : మనం నిద్ర లేచిన సాధారణంగా చేసే పని ఏంటంటే.. మనకి బాగా నచ్చిన వాళ్ళ ముఖం చూస్తాం. లేదా కొంతమంది తమ చేతులను చూసుకొని ప్రార్ధించుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. అయితే నిద్ర లేచిన వెంటనే వాస్తు ప్రకారం వీటిని చూస్తే చాలా మంచిది అని వాస్తు పండితులు అంటున్నారు. అలాగే వాస్తు ప్రకారం ఫాలో అయితే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరమైపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుందని కూడా చెబుతున్నారు. వాస్తు ప్రకారం ఎటువంటి వాటిని మనం లేచిన తర్వాత చూడాలి అనే విషయాలు మీకోసం ప్రత్యేకంగా..
దేవుడి ఫోటోలు, నచ్చిన వారి ఫోటోలు..
చాలా మందికి దేవుడి ఫోటోలను, బాగా నచ్చిన వారి ఫోటోలు చూసుకోవడం అలవాటుగా ఉంటుంది. ఇది కూడా వాస్తు ప్రకారం మంచిదని అంటున్నారు. ఇందువల్ల మనలో ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుందని చెబుతున్నారు.
సుమంగళిని చూడడం..
తెల్లవారుజామున, సుమంగళిని చూడడం లేదా ఆమె చేతిలోని పూజా పళ్ళెన్ని చూస్తే, అది కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది.
అద్దం..
వాస్తు ప్రకారం ఉదయం లేచిన వెంటనే అద్దంలో చూసుకుంటే చాలా మంచిది అని సూచిస్తున్నారు. దీని వల్ల నెగటివ్ ఎనర్జీని తొలగించి.. పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తుందని చెబుతున్నారు. కానీ మీరు అద్దంలో చూసే ముందు ఒకసారి మీ ముఖాన్ని కడుక్కుని ఆ తర్వాత అద్దంలో చూసుకోవడం ముఖ్యం.
పాలు లేదా పెరుగు..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉదయం పూట పాలు, పెరుగు మొదలైనవి కనిపించడం కూడా శుభప్రదమే. ఇది మీ అదృష్టాన్ని సూచిస్తుంది.
పక్షులు..
ఉదయం కళ్లు తెరిచిన వెంటనే పక్షుల కిలకిలరావాలు వినిపిస్తే.. ఆ రోజు శుభప్రదంగా ప్రారంభమవుతుందని అర్థం చేసుకోండి.
ఆవు..
ఉదయం ఆవును చూడటం శుభసూచకంగా పరిగణించబడుతుంది. ఎవరైనా తెల్లవారుజామున గోవు దర్శనం చేసుకుంటే, దాని ద్వారా డబ్బు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
గంటల శబ్దం..
ఉదయం కళ్లు తెరిచిన వెంటనే గుడి లేదా గుడిలో గంటలు మోగే శబ్దం వస్తే అది చాలా శుభప్రదంగా భావిస్తారు. దీని కారణంగా కొన్ని శుభవార్తలు అందుతాయి
నిద్ర లేవగానే చూడకూడనివి (Devotional News)..
భయంకరమైన జంతువులు..
ఉదయం లేచిన తర్వాత భయంకరమైన జంతువులని చూడడం ఆ రోజంతా నెగటివ్ గా ఉంటామంటున్నారు.
శుభ్రం చేయని సామాన్లు..
రాత్రి తినేసి శుభ్రపరచని సామాన్లను చూడకూడదని… అవి నెగిటివ్ ఎనర్జీని కలిగిస్తుందని తెలుపుతున్నారు. అందుకే రాత్రి తిన్న సామాన్లను శుభ్రం చేసుకోవాలి లేకపోతే నెగటివ్ ఎనర్జీ కలిగి పాజిటివ్ ఎనర్జీ దూరమవుతుందని వాస్తు నిపుణులు సలహా ఇస్తున్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/