Today Horoscope: నిత్యజీవితంలో రోజు జరగబోయే విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందుకే ఎక్కువగా ప్రజలు విశ్వసించే విధానం.. జ్యోతిష్యం. రాశుల గ్రహ స్థితిగతులను లెక్కించి ఆ వ్యక్తుల భవిష్యత్తు ఎలా ఉండబోతుందని జ్యోతిష్య పండితులు లెక్కిస్తారు. 12 రాశుల వారి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.
మేషం: నేడు ఈ రాశివారు కాలానికి అనుగుణంగా ముందుకు వెళితే అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. ముఖ్యమైన పనుల్లో కొంత జాప్యం జరిగినా.. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. మేషరాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయడం వల్ల అంతా మంచే జరుగుతుంది.
వృషభం: ఈ రాశి వారు ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. శారీరక శ్రమ పెరిగినా.. ఏకాగ్రతతో పనిచేస్తే అనుకున్నది పొందుతారు. దగ్గరి వారితో విబేధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆహార విషయంలో నియమాలు పాటించాలి. అష్టమంలో చంద్ర సంచారం అనుకూలంగాలేదు. కాబట్టి చంద్ర శ్లోకం చదువుకోవాలి.
బుద్ది బలంతో వ్యవహరిస్తారు(Today Horoscope)
మిథునం: ఉద్యోగం విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి మంచి శుభకాలం నడుస్తోంది. మంచి పనులు చేపడతారు. బుద్ది బలంతో కీలకమైన సమస్యలను పరిష్కరిస్తారు. మహాగణపతి ఆరాధన చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
కర్కాటకం: ఈ రాశి వారికి ముఖ్యమైన విషయాల్లో ఓర్పుగా వ్యవహరించాలి. విజ్బాన పరంగా ఎదుగుదల ఉంటుంది. పక్కనే ఉండి ఇబ్బంది కలిగించే వారు ఉన్నారు. జాగ్రత్తలు అవసరం. ఒక శుభవార్త వింటారు. శివుని పూజించడం మంచిది.
సింహం: సింహ రాశి వారికి ఇష్టమైన కార్యక్రమాలు నెరవేరుతాయి. ముఖ్య విషయాల్లో కుటుంబ సభ్యులు సహకారం అందిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్ట దైవ ఆరాధన మేలు చేస్తుంది.
గోవిందనామాలు చదవడం వల్ల(Today Horoscope)
కన్య: మీ మీ రంగాల్లో వృద్ధి సాధించాలంటే శ్రద్ధగా పనిచేయాలి. అందరినీ కలుపుకుని పోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి. ఆవేశాలకు దూరంగా ఉండాలి. మధ్యమ ఫలితాలు కనిపిస్తున్నాయి. సమాచారం లోపం లేకుండా చూసుకోవాలి. గోవిందనామాలు చదవడం వల్ల మంచి జరుగుతుంది.
తుల: చక్కటి ఆలోచనలతో ముందుగు సాగి మంచి పేరును తెచ్చుకుంటారు. శివుని పూజించడం వల్ల ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. మొదలు పెట్టిన పనిలో ముందుచూపుతో వ్యవహరించడం వల్ల అనుకున్నది నెరవేరుతుంది.
వృశ్చికం: చేపట్టిన పనులు కొద్దిగా ఆలస్యం అవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. శ్రమ అధికం అవుతుంది. శివుని ఆరాధన చేయాలి.
పట్టుదలతో ఉండాలి
ధనుస్సు: ఈ రాశి వారికి నేడు మంచి ఫలితాలు సాధిస్తారు. ఒక వార్త మనోధైర్యాన్ని పెంచుతుంది. మంచి ప్రణాళికతో వ్యాపారంలో లాభాలను పొందుతారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం.
మకరం: ఉద్యోగంలో మిశ్రమ వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో చేపట్టే పనుల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇష్ట దైవాన్ని సందర్శించుకోవాలి. శుభవార్త వింటారు.
కుంభం: ఆర్థికంగా జాగ్రత్తలు అవసరం. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అనుకూలమైన వాతావరణం ఉంటుంది. లక్ష్మీగణపతి పూజించడం ఉత్తమం.
మీనం: ఉద్యోగ, వ్యాపారం, వృత్తి లాంటి రంగాల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. కలహాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. పట్టుదలతో వ్యవహరించాలి. దక్షిణా మూర్తి స్తోత్రం చదివితే మంచి జరుగుతుంది.