Site icon Prime9

Srikalahasti : శ్రీకాళహస్తిలో రాహు..కేతు పూజలు చేసిన బ్రెజిల్ దేశస్తులు

Srikalahasti

Srikalahasti

Srikalahasti: 22 మంది బ్రెజిల్ దేశస్తులు హిందూ సంప్రదాయ వస్త్రధారణలో శ్రీకాళహస్తిలో రాహు..కేతు పూజలు చేశారు. అనంతరం కాళహస్తీశ్వరుడిని భక్తితో దర్శించుకున్నారు. ఆలయ సందర్శన తమకు దక్కిన అదృష్టమని చెప్పారు.

ఈ సందర్బంగా మృత్యుంజయ  అభిషేకంతో పలు పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించారు. కాళహస్తీశ్వరుని ఆలయాన్ని సందర్శించుకోవడం తమ అదృష్టమని, కాళహస్తిలో తనకు మంచి ఆతిథ్యం లభించిందని బ్రెజిల్‌ భక్తుడు ఒకరు తెలిపారు. బ్రెజిల్ భక్తులను స్వాగతించడం సంతోషంగా ఉందని కాళహస్తీశ్వర ఆలయ కార్యనిర్వాహణ అధికారి చెప్పారు. మన ఆచారాలు, నమ్మకాలను మనం వదిలేస్తున్నాం కానీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు హిందూ పురాణాలను విశ్వసిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

Exit mobile version