Vastu Tips : హిందూ మత ఆచారాల ప్రకారం వాస్తు అనేది ప్రతి మనిషి జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది అని నమ్ముతారు. ఇంట్లో సానుకూల శక్తి ఉన్నప్పుడు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు వెల్లి విరుస్తాయి. అలా కాకుండా ప్రతికూల శక్తులు ఉంటే పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటాయి. చిన్న చిన్న వాటికి గొడవపడటం, మానసికంగా కృంగిపోవడం వంటి అనేక ఇబ్బందులు కలుగుతాయి. ఇంట్లో ఉండే వాస్తు దోషాలు వైవాహిక జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. అయితే వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే కొన్ని సులభమైన వాస్తు చిట్కాలను పాటిస్తే ఫలితం ఉంటుందని చెబుతున్నారు వాస్తు శాస్త్రం నిపుణులు.
వాస్తు ప్రకారం ఇల్లు నిర్మించుకోవడమే కాదు సానుకూల శక్తిని ఉంచేలా చేసుకోవడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. అలంకరణ విషయంలో వస్తువులను ఎక్కడ పడితే పెట్టకూడదు. ముఖ్యంగా గోడలకు తగిలించే చిత్రాలు, ఫొటోల విషయంలో జాగ్రత్త వహించాలి. అప్పుడే జీవితంలో ఆనందం, శ్రేయస్సు ఉంటాయని తెలుస్తుంది. వాటిలో ప్రధానంగా పక్షుల ఫోటోలు కూడా వాస్తు ప్రకారం కొన్ని సమస్యలు పోగొట్టడానికి సహకరిస్తాయని శాస్త్ర నూపుణులు తెలుపుతున్నారు. అవేంటో మీకోసం ప్రత్యేకంగా..
వాస్తు ప్రకారం సమస్యలు తొలగించేందుకు ఉపయోగపడే పక్షుల ఫోటోలు (Vastu Tips)..
ఫినిక్స్ ..
వాస్తు ప్రకారం ఇంట్లో ఫినిక్స్ పక్షి చిత్రాన్ని ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. ఈ చిత్రం ద్వారా మీ ఇంట్లో వారికి విజయానికి దారితీస్తుంది. సానుకూల శక్తిని పెంచుతుంది అని నమ్ముతారు. వాస్తవానికి ఫినిక్స్ పక్షి అంత సులభంగా ఎక్కడా కనిపించదు.
చిలుకలు..
చిలుకలను చాలా పవిత్రమైన జీవులుగా భావిస్తారు. ఆకుపచ్చ రంగులో ఉండే ఇది బుధ గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. అందుకే చాలా మంది ఇంట్లో చిలుకలను పెంచడాన్ని ఇష్టపడతారు. అయితే ఇది సాధ్యం కాకపోతే మీరు ఇంట్లో చిలుక చిత్రాన్ని ఉంచడం ద్వారా శుభఫలితాలను పొందవచ్చు. చిలుక ఛాయచిత్రాన్ని తూర్పు దిశలో ఉంచడం ద్వారా సానుకూల ఫలితాలు పొందవచ్చు.
కాకి..
కాకులను చాలా మంది అశుభానికి చిహ్నంగా, చెడు శకునంగా భావిస్తారు. అయితే ఇందులో వాస్తవం లేదు. కాకి మీ ఇంటి ఉత్తర దిశలో ఉండి అరిస్తే లక్ష్మీ దేవి మీ ఇంటికి రాబోతుంది, పడమటి దిశ నుంచి అరిస్తే అతిథుల రాకను సూచిస్తుందని తెలుసుకోవాలి. పూర్వకాలంలో కాకులు పదే పదే కనిపిస్తే త్వరలో శుభవార్త అందుకోబోతున్నామని తెలుసుకుంటారు.
లవ్ బర్డ్స్..
వాస్తు ప్రకారం ప్రేమ పక్షులను చాలా శుభకరంగా భావిస్తారు. ఇంట్లో ఉత్తరాన ఉన్న ప్రేమ పక్షుల చిత్రాన్ని వర్తింపజేయడం వల్ల మీ ఇంట్లో సానుకూల శక్తి సంభాషణ పెరుగుతుంది. మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. ప్రేమ దేవుడిగా భావించే శుక్ర గ్రహానికి అనుసంధానించడం ద్వారా ప్రేమ పక్షులను గ్రహాల మార్పుకు కారకంగా చూడవచ్చు. శుక్రవారం నాడు ఈ లవ్ బర్డ్స్ చిత్రాన్ని ఇంట్లో తీసుకురావడం వల్ల సానుకూల ఫలితాలు పొందుతారు.