Tirumala: తిరుమలలో శనివారం అర్ధరాత్రి వరకు 78,833 మంది స్వామి వారిని దర్శించుకోగా, 36,074 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీల్లో కానుకల రూపంలో భక్తులు రూ.4.73 కోట్లు సమర్పించుకున్నారు. శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.
బ్రహ్మోత్సవాల రోజుల్లో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వీఐపీ బ్రేక్ దర్శనాలు, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం తదితర ప్రివిలేజ్డ్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఆర్జిత సేవలు, రూ.300 దర్శన టికెట్లతోపాటు శ్రీవాణి ట్రస్ట్ దాతలు, ఇతర ట్రస్ట్‌ల దాతలకు దర్శన టికెట్లను రద్దు చేసింది. స్వయంగా వచ్చే ప్రొటోకాల్ వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనం ఉంటుంది