Site icon Prime9

Chhattisgarh: తనతో మాట్లాడడం లేదని.. మహిళను స్క్రూడ్రైవర్‌తో 51 సార్లు పొడిచి

Chhattisgarh

Chhattisgarh

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో 20 ఏళ్ల యువతి తనతో మాట్లాడేందుకు నిరాకరించినందుకు ఓ వ్యక్తి ఆమెను స్క్రూడ్రైవర్‌తో 51 సార్లు పొడిచి చంపాడు.సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎస్‌ఇసిఎల్) పంప్ హౌస్ కాలనీలో డిసెంబర్ 24న ఈ ఘటన జరిగిందని సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (కోర్బా) విశ్వదీపక్ త్రిపాఠి తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు అక్కడికి వచ్చేసరికి బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆమె అరవకుండా నోటిని దిండుతో కప్పి, స్క్రూడ్రైవర్‌తో 51 సార్లు పొడిచాడు. బాధితురాలి సోదరుడు ఇంటికి వచ్చిన తర్వాత ఆమె రక్తపు మడుగులో కనిపించిందని అధికారి తెలిపారు. జష్‌పూర్ జిల్లాకు చెందిన నిందితుడు మూడేళ్ల క్రితం ఓ ప్యాసింజర్ బస్సులో కండక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు బాధితురాలితో స్నేహం చేశాడు. ఆ మహిళ ఆ బస్సులో ప్రయాణించేదని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు

వీరిద్దరూ చాలాకాలంగా ఫోన్‌లో టచ్‌లో ఉన్నారు. మహిళ అతనితో ఫోన్‌లో మాట్లాడటం మానేసిన తర్వాత, నిందితుడు ఆమె తల్లిదండ్రులను కూడా బెదిరించాడని ఎస్పీ తెలిపారు. కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుడి కోసం నాలుగు పోలీసు బృందాలను ఏర్పాటు చేసామన్నారు.

Exit mobile version