Site icon Prime9

Tata Consultancy Services: దేశంలో నెం.1 బ్రాండ్ గా టిసిఎస్

TCS is the top brand in India

TCS is the top brand in India

Mumbai: ప్రపంచ మార్కెట్ విశ్లేషణలో గుర్తింపు పొందిన సంస్ధల్లో ఒకటైన కంతార్ బ్రాండ్జడ్ భారతదేశంలో అత్యంత విలువైన బ్రాండ్ ‘టాటా కన్సల్టెన్సీ సర్వీసస్’ ఒకటని ప్రకటించింది. దేశంలోని ప్రముఖ 75 బ్రాండ్ కంపెనీలపై చేపట్టిన విశ్లేషణలో ఈమేరకు కంతార్ కంపెనీ తెలిపింది. గతంలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు నుండి ఈ స్థానాన్ని 45.5 బిలియన్ల విలువతో టిసిఎస్ కంపెనీ కౌవశం చేసుకొన్నట్లు కంతార్ తెలిపింది. రెండువ స్థానంలో 32.7 బిలియన్ల విలువతో హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఉన్నట్లు ప్రకటించింది. మూడవ స్థానంలో ఇన్ఫోసిస్ 29.2 బిలియన్ల విలువతో కొనసాగుతుందని తెలిపింది. తొలిసారిగా టాప్ 10లో ఐసిఐసిఐ బ్యాంకు 11 బిలియన్ల విలువతో స్థానం దక్కించుకొనిందని కంతార్ బ్రాండ్జడ్ ప్రకటించింది. టెక్, బ్యాంకింగ్ బ్రాండ్‌లు మొత్తం విలువలో సగానికి పైగా ఉన్నాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. వినియోగదారునికి అవసరమైనప్పుడు బ్రాండ్‌లు త్వరగా గుర్తుపెట్టుకునే సామర్థ్యం భారతదేశంలోని టాప్ 10 బ్రాండ్‌లలో ఒక సాధారణ లక్షణంగా కంపెనీ తెలిపింది.

Exit mobile version