Site icon Prime9

TCS CEO: టీసీఎస్ సీఈఓ గోపీనాథన్ రాజీనామా.. నెక్ట్ సీఈఓ ఎవరంటే..

TCS CEO

TCS CEO

TCS CEO: దిగ్గజ ఐటీ కంపెనీ టీసీఎస్ కు సీఈఓ గోపీనాథన్ గుబ్ డై చెప్పారు. గత ఏడాది ఏప్రిల్ లో జరిగిన టీసీఎస్ వాటాదారుల ఏజీఎం గోపీనాథన్ ఐదేళ్ల పాటు సీఈఓ, ఎండీ గా నియమించేందుకు ఆమోదం తెలిపింది.

ఈ ఆమోదం ప్రకారం గోపీనాథన్ ఆ పదవిలో 2027 వరకు కొనసాగవచ్చు. అయితే నాలుగేళ్ల ముందే ఆయన తన పదవి నుంచి తప్పుకున్నారు.

గోపీనాథన్ రాజీనామా చేయడంతో కొత్త సీఈఓగా కంపెనీ బీఎఫ్ఎఫ్ఐ విభాగం గ్లోబల్ హెడ్ కే కృతివాసన్ నియమితులయ్యారు.

ఈ ఏడాది సెప్టెంబర్ 15 వరకు గోపీనాథన్ టీసీఎస్ లోనే ఉండి, కృతివాసన్ ను మార్గదర్శకం చేయనున్నారు.

కాగా , గోపీనాథన్ గత 22 ఏళ్లుగా టీసీఎస్ లో వివిధ కీలక బాధ్యతలు నిర్వహించారు.

గత ఆరేళ్లుగా కంపెనీ సీఈఓ, ఎండీ గా ఆయన టీసీఎసప్ ఆదాయాన్ని 1000 కోట్ల డాలర్లు పెంచారు.

అయితే అనూహ్యంగా గోపీనాథన్ ఎందుకు రాజీనామా చేసారనేది కంపెనీ వెల్లడించలేదు.

 

ఇపుడు చాలా తేలికగా ఉంది: గోపీనాథన్(TCS CEO)

మరో వైపు రాజీనామా అనంతరం గోపీనాథన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తన మనసు సంతోషంగా, చాలా తేలికగా ఉందని వ్యాఖ్యానించారు.

తప్పుకోవడానికి ఇంతకన్నా మంచి సమయం లేదని తాను భావించినట్టు చెప్పారు.

ఏ నిమిషమైతే ఆసక్తి పోతుందో.. ఆ నిమిషమే తప్పుకోవాలన్నారు. గత 48 గంటలుగా చాలా స్వేచ్ఛగా ఉందన్నారు.

అలాగే తన రాజీనామాపై టాటా సన్స్ ఛైర్మన్ , టీసీఎస్ మాజీ సీఎండీ చంద్రశేఖరన్ తో చర్చించి, వారం క్రితమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు గోపీనాథన్ వివరించారు.

టీసీఎస్ లో ప్రతీ నిమిషం ఆస్వాదించానని చెప్పుకొచ్చారు. కానీ కొన్ని సార్లు కీలక మైలు రాళ్లను చేరుకున్నప్పునడు ఆలోచన మొదలవుతుందన్నారు.

అప్పుడే నెక్ట్స్ ఏంటీ? అనేది ఖచ్చితంగా పెద్ద ప్రశ్నగా ఉంటుందని తెలిపారు.

అయితే , ప్రస్తుతానికి తర్వాత ఏం చేయాలో తాను ఇంకా నిర్ణయం తీసుకోలేదని గోపీనాథన్ తెలిపారు.

కొత్తగా సీఈఓ అయిన కృతి వాసన్ కు సాఫీగా బాధ్యతల్ని అప్పగించడమే తన కర్తవ్యం అని తెలిపారు.

టీసీఎస్ కు కావాల్సినపుడు ఎపుడూ అందుబాటులో ఉంటానని గోపీనాథన్ తెలిపారు.

కాగా, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న పరిస్థితుల సమయంలోనే పదవి నుంచి వైదొలగడంపై ఆయన స్పందించారు.

గత పదేళ్లలో తనకు ఇదే అత్యంత స్థిరమైన కాలంగా కనిపిస్తోందన్నారు. ఇంతకంటే ఒడిదొడికులు గతంలో చవిచేశామని తెలిపారు.

అలాంటి సమయంలోనే అందరం ఏకతాటిపై నిలబడి సమర్థంగా సవాళ్లను ఎదుర్కొన్నామని ఆయన గుర్తుచేశారు.

 

 

Exit mobile version
Skip to toolbar