SBI Q3 Results: దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడో త్రైమాసికి ఫలితాలను విడుదల చేసింది. ఏడాది ప్రాతిపదికన బ్యాంక్ స్టాండ్‌లోన్ నికర లాభంలో 84.32 శాతం బంపర్ పెరుగుదల ఉంది. తద్వారా డిసెంబర్ త్రైమాసికంలో బ్యాంక్ నికల లాభం రూ.16,891.44 కోట్లు. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.9,163.96 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. అయితే త్రైమాసిక ప్రాతిపదికన చూస్తే, బ్యాంకు లాభాలు దాదాపు 8 శాతం క్షీణించాయి. జూలై నుండి సెప్టెంబర్ 2024 త్రైమాసికంలో SBI నికర లాభం రూ.18,331 కోట్లు. ఎస్‌బీఐ షేర్లు ఈరోజు గురువారం క్షీణతతో ముగిశాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఎస్‌బీఐ వడ్డీ ఆదాయం రూ.1,17,427 కోట్లుగా ఉంది. ఇది ఏడాది క్రితం వడ్డీ ఆదాయం రూ.1,06,734 కోట్లతో పోలిస్తే 10 శాతం ఎక్కువ. అదే సమయంలో బ్యాంకు నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 4 శాతం పెరిగి రూ.41,446 కోట్లకు చేరుకుంది. NII అనేది రుణంపై పొందిన వడ్డీ, డిపాజిట్‌పై చెల్లించే వడ్డీ మధ్య వ్యత్యాసం. మూడో త్రైమాసికంలో బ్యాంక్ నిర్వహణ లాభం వార్షిక ప్రాతిపదికన 15.81 శాతం పెరిగి రూ.23,551 కోట్లకు చేరుకుంది.
ఎస్‌బీఐ ఆస్తి నాణ్యత గురించి మాట్లాడితే ఒక సంవత్సరం క్రితం ఇదే కాలంతో పోలిస్తే ఇది స్థిరంగా ఉంది. డిసెంబర్ త్రైమాసికంలో స్థూల ఎన్‌పీఏ నిష్పత్తి 2.07 శాతంగా ఉంది. సెప్టెంబర్ త్రైమాసికంలో ఇది 2.13 శాతం కంటే తక్కువ. కాగా, నికర ఎన్‌పీఏ 0.53 శాతం వద్ద స్థిరంగా ఉంది. ఈరోజు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ఎస్‌బీఐ షేర్లు 1.79 శాతం లేదా రూ.13.75 క్షీణించి రూ.752.35 వద్ద ముగిసింది. ఈ షేర్ 52 వారాల గరిష్టం రూ.912.10. కాగా 52 వారాల కనిష్టం రూ.654.15. ఈరోజు బిఎస్‌ఇలో ఎస్‌బిఐ మార్కెట్ క్యాప్ రూ.6,71,443.79 కోట్ల వద్ద ముగిసింది.