Site icon Prime9

Reliance Retail: త్వరలో రిలయన్స్ సెలూన్లు

Reliance

Reliance

Reliance Salon Business: రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ సెలూన్ పరిశ్రమలోకి అడుగుపెట్టనుంది. చెన్నై’నేచురల్స్ సలోన్ అండ్ స్పా’ కు చెందిన 49% షేర్లను కొనేందుకు రిలయన్స్ రిటైల్ ఆఫర్ చేసినట్లు సమాచారం. నేచురల్స్ సెలూన్ అండ్ స్పా కంపెనీ సీఈవో కుమారవేల్ కూడా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

2000 సంవత్సరంలో ప్రారంభమైన నేచురల్ సలోన్ & స్పాకు భారతదేశం అంతటా 650కి పైగా సెలూన్‌లు ఉన్నాయి. 2025 నాటికి 3,000 సెలూన్‌లకు విస్తరించాలన్నది నేచురల్ సలోన్ & స్పా ప్లాన్‌. నేచురల్‌ సలోన్‌ విలువను ఇప్పటికే రిలయన్స్‌ అంచనా వేసింది. ఈ విలువ పై ఇరువర్గాలు అంగీకారానికి వచ్చే అంశం మీదే చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

నేచురల్స్ సలోన్ & స్పా సీఈవో &కో ఫౌండర్‌ CK కుమారవేల్ దీనిపై సోషల్ మీడియాలో స్పందించారు. “ఒక బహుళ జాతి సంస్థ సెలూన్‌ రంగంలోకి అడుగు పెట్టబోతోంది, ఇది అతి పెద్ద మలుపు” అంటూ లింక్డ్‌ ఇన్‌లో పోస్ట్‌ చేశారు. ఇప్పుడున్న మొత్తం 700 సెలూన్‌ల నుంచి భవిష్యత్తులో భారీ వృద్ధి ఉండబోతోంది. ఈ నంబర్‌లో 4 -5 రెట్లు పెరుగుదల ఉంటుంది” అని కుమారవేల్ పేర్కొన్నారు. “రాబోయే కాలంలో నేచురల్స్ సలోన్ & స్పాలో అనూహ్య మార్పులను మనం చూస్తాము” అని వెల్లడించారు.

 

Exit mobile version