Site icon Prime9

Raveendran Byju: ‘బైజూస్’ ఆఫీసుల్లో ఈడీ సోదాలు.. కీలక డేటా స్వాధీనం

Raveendran Byju

Raveendran Byju

Raveendran Byju: ప్రముఖ ఎడ్యుకేషన్ యాప్ బైజూస్‌ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌ బైజు , ఆయన సంస్థ థింక్‌ అండ్‌ లెర్న్‌ ప్రైవేట్ లిమిటెడ్‌ కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ శనివారం సోదాలు చేస్తోంది. ఫెమా చట్టం కింద నమోదైన కేసులో భాగంగా మొత్తం మూడు ప్రాంతాల్లో ఈడీ తనిఖీలు చేపట్టింది. ఈ సోదాల్లో పలు డాక్యుమెంట్లు, డిజిటల్‌ డేటాను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

 

వేల కోట్ల విదేశీ పెట్టబడులతో(Raveendran Byju)

థింక్‌ అండ్‌ లెర్న్‌ ప్రైవేట్ లిమిటెడ్‌ సంస్థ ఆన్ లైన్ లో బైజూస్‌ పేరుతో విద్యా కోర్సులను అందిస్తోన్న విషయం తెలిసిందే. ఈ కంపెనీ 2011 నుంచి 2023 మధ్య రూ. 28 వేల కోట్ల విలువైన విదేశీ పెట్టుబడులు(ఎఫ్డీఐ) అందుకుందని ఈ తనిఖీల్లో బయటపడిందని ఈడీ ఓ ప్రకటనలో వెల్లడించింది. అదే విధంగా కంపెనీ కూడా రూ. 9,754 కోట్లను ఓవర్సీస్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ పేరుతో వివిధ విదేశీ సంస్థలకు బదిలీ చేసినట్టు తెలిపింది.

 

 

ఫిర్యాదుల మేరకే సోదాలు(Raveendran Byju)

అయితే ఇందులో అవకతవకలు జరిగాయని, ఫెమా చట్టాన్ని ఉల్లంఘించి సదరు నిధులను అందుకున్నట్టు ప్రైవేటు వ్యక్తుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకే సోదాలు చేసినట్టు ఈడీ వెల్లడించింది. ఈ కేసుకు సబంధించి చాలా సార్లు రవీంద్రన్‌కు సమన్లు జారీ చేశాయని.. అయితే ఆయన విచారణకు హాజరుకాలేదని ఈడీ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయన ఇల్లు, రెండు ఆఫీసుల్లో సోదాలు జరిపినట్లు తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆర్థిక లావాదేవీలను వెల్లడించలేదు. ఖాతాలను కూడా ఆడిటింగ్‌ చేయించలేదని ఈడీ తన ప్రకటనలో పేర్కొంది.

 

Exit mobile version