Post Office Scheme:మెరుగైన భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు తమ తమ తాహతుకు తగ్గట్టు పొదుపు చేస్తుంటారు. అయితే అన్నీ స్కీంలతో పోల్చుకుంటే పోస్టాఫీసు స్కీంలో పెట్టుబడులు పెడితే మన పెట్టుబడికి భద్రతతో పాటు కొంత ఆదాయం వడ్డీరూపంలో లభిస్తుంది. అయితే పోస్టాఫీసులో ప్రతి నెలా రూ.7,000 చొప్పున పొదుపు చేస్తే మేచురిటీ తర్వాత చివరగా రూ.80వేల వరకు వడ్డీ పొందవచ్చు. వివరలు ఇలా ఉన్నాయి.
ప్రతి నెల పోస్టాఫీసులో ఒకేసారి పెద్ద మొత్తంలో డిపాజిట్ చేయాల్సిన అసవరం లేదు. మీ జీతం నుంచి నెలకు కొంత మొత్తం రికరింగ్ డిపాజిట్ చేస్తే దానిపై సంవత్సరానికి పోస్టాఫీసు 6.7 శాతం వడ్డీ ఇస్తుంది. ఈ స్కీంలో ఎవరైనా పెట్టుబడి పెట్టవచ్చు. కావాలనుకుంటే మైనర్ల పేరుతో కూడా ఆర్‌డీ తెరవవచ్చు. నెల వారి ఇన్వెస్ట్ మెంట్ రిస్క్ ఫ్రీ.. పోస్టాఫీసు ఆర్‌డీలో కనిష్టంగా రూ.100 ఇన్వెస్ట్ చేయవచ్చు. గరిష్టంగా ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకొనే వెసులు బాటు ఇన్వెస్టర్‌కు ఉంటుంది. ఇక మైనర్ పేరుపై ఆర్‌డీ ఒపెన్ చేయాలనుకున్నప్పుడు డాక్యుమెంట్లపై తల్లిదండ్రుల పేర్లు రాయల్సి ఉంటుంది.
నెలకు రూ.5,000 చొప్పున ఆర్‌డీ ప్రారంభిస్తే..(Post Office Scheme)
ఇక ఆర్‌డీపై రూ.80వేల వడ్డీ సంపాదించుకోవాలనుకుంటే.. ప్రతి నెల పోస్టాఫీసు ఆర్‌డీలో ఐదు సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ.7,000 డిపాజిట్ చేస్తే ఐదు సంవత్సరాల తర్వాత రూ.4,20,000 అవుతుంది. 60 నెలల తర్వాత మెచురిటీ దాటిన తర్వాత దీనిపై రూ.79,564లు వడ్డీ లభిస్తుంది. గడువు ముగిసిన తర్వాత ఆర్‌డీ చేసిన ఇన్వెస్టర్ రూ.4,99,564 లభిస్తుంది. ఒక వేళ నెలకు రూ.5,000 చొప్పున ఆర్‌డీ ప్రారంభిస్తే.. సంవత్సరానికి రూ.60,000 జమ అవుతాయి. ఐదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఈ మొత్తం రూ.3 లక్షల రూపాయలకు చేరుతుంది. ఐదు సంవత్సరాలకు 6.7 శాతం వడ్డీ చొప్పున మేచురిటీ సమయంలో రూ.3,56,830 లభిస్తుంది.
అయితే ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి పోస్టాఫీసు సేవింగ్స్ స్కీమ్‌లో పలు మార్పులు చేర్పులు చేస్తుంది. ఆర్‌డీ స్కీంపై ఇచ్చే వడ్డీపై టీడీఎస్ కోత విధిస్తారు. అయితే దీన్ని ఇన్‌కంటాక్స్ రిటర్న్‌లో చూపించి తిరిగి పొందవచ్చు. ఆర్‌డిపై వచ్చే వడ్డీపై 10 శాతం పన్ను విధిస్తారు. ఒక వేళ ఆర్‌డీపై వడ్డీ రూ.10వేల కంటే ఎక్కువ వస్తే టీడీఎస్.. టాక్స్ డిడెక్షన్ ఎట్ సోర్స్ ద్వారా పన్ను విధించి మిగిలిన డబ్బు ఇస్తారు.