Site icon Prime9

OnePlus Nord watch: వన్‌ప్లస్‌ నార్డ్ వాచ్‌ లాంచ్‌.. స్మార్ట్ వాచ్ వివరాలు ఇవే..

smart watch prime9news

smart watch prime9news

OnePlus Nord watch: వన్‌ప్లస్‌ నార్డ్ వాచ్‌ లాంచ్‌కు సిద్దం చేస్తున్నారని తెలిసిన సమాచారం. వన్‌ప్లస్‌ నుంచి చాలా తక్కువ ధరతో ఈ స్మార్ట్ వాచ్‌గా మన ముందుకు రాబోతుంది. ఈ నెలాఖరులో భారత్‌లో ఈ వాచ్‌ను వన్‌ప్లస్‌ లాంచ్ చేయనున్నారు. ఈ విషయాన్ని వన్‌ప్లస్‌ సంస్థ వారు ప్రకటించారు. ఒక్కొక్కటిగా స్పెసిఫికేషన్లను బయటకు వెల్లడిస్తోంది. మనం కొనుగోలు చేసేందుకు ఆసక్తి పెరిగేలా చేస్తోంది. ఇప్పటి వరకు ఈ నా స్మార్ట్ వాచ్‌కు సంబంధించిన డిస్‌ప్లే మరియు వాచ్‌ ఫేసెస్ గురించి వెల్లడించింది. లాంచ్ చేసే ముందు వరకు రెండు రోజులకొకసారి ఫీచర్లను ప్రకటిస్తుంది.

వన్‌ప్లస్‌ నార్డ్ వాచ్‌ డిస్‌ప్లే, డిజైన్, కలర్ ఆప్షన్లు ఈ విధంగా ఉన్నాయి..

1.78 ఇంచుల AMOLED display నార్డ్ వాచ్‌ను తీసుకొస్తున్నట్టు వన్‌ప్లస్‌ సంస్థ వారు వెల్లడించారు. వన్‌ప్లస్‌ అధికారిక వెబ్‌సైట్‌లో నార్డ్ వాచ్‌ కోసం ఒక పేజీని ఏర్పాటు చేసి దాని నుంచి వన్‌ప్లస్‌ నార్డ్ వాచ్‌ ఫీచర్లను ఒక్కొక్కటిగా బయటకు వెల్లడిస్తోంది. ఈ డిస్‌ప్లే స్క్వేర్ షేప్‌లో ఉండగా, 60Hz రిఫ్రెష్ రేట్‌ వన్‌ప్లస్‌ నార్డ్ స్మార్ట్ వాచ్‌ కు ఉంటుంది. ఈ స్మార్ట్ వాచ్ ప్రత్యేకత ఏంటంటే 100కు పైగా ఆన్‌లైన్ వాచ్‌ ఫేసెస్‌‌కు సపోర్ట్ చేస్తుంది. ఇప్పటి వరకు వన్‌ప్లస్‌ ఈ ఫీచర్లను పేర్కొంది. 1.78 ఇంచుల AMOLED display ఉండనుండగా, 500 నిట్స్ వరకు బ్రైట్‌నెస్, 326 పిక్సెల్ పర్ డెన్సిటీ, ఆండ్రాయిడ్‌,ios స్మార్ట్‌ఫోన్‌ల్లో ఎన్ హెల్త్ యాప్‌కు ఈ స్మార్ట్ వాచ్‌ సపోర్ట్ చేస్తుంది. మాకు తెలిసిన సమాచారం ప్రకారం వన్‌ప్లస్‌ నార్డ్ వాచ్‌ ధర రూ.5,000 నుంచి రూ.6,000 మధ్యలో ఉంటుందని తెలిసింది.

Exit mobile version