Kotak Mahindra Bank: ప్రైవేటు రంగ బ్యాంక్ ‘కోటక్ మహీంద్రా’వ్యవస్థాపకుడు, సీఈఓ ఉదయ్ కోటక్ కుమారుడు జై కోటక్ , నటి అదితి ఆర్య పెళ్లీ పీటలెక్కనున్నారు. కాగా, వీరు ఇరువురికి గత ఏడాదే ఎంగేజ్ మెంట్ అయినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇరు కుటుంబాలు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాయి. తాజాగా జై కోటక్ స్వయంగా ఈ విషయాన్ని బయటపెట్టారు. తనకు కాబోయే భార్య యేల్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందింది అంటూ ఆయన ట్వీట్ చేశారు. దీంతో ఇద్దరి ఎంగేజ్ మెంట్ విషయం వెలుగులోకి వచ్చింది.
Aditi, my fiancée, completed her MBA from Yale University today. Immensely proud of you @AryaAditi pic.twitter.com/xAdcRUFB0C
— Jay Kotak (@jay_kotakone) May 24, 2023
చాలా రోజుల నుంచి ఊహాగానాలు (Kotak Mahindra Bank)
జై కోటక్, అదితి ఆర్య నిశ్చితార్థం పై చాలా రోజుల నుంచి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీరిద్దరు పారిస్‌లోని ఈఫిల్ టవర్ వద్ద దిగిన ఫొటోలు బయటకు కూడా వచ్చాయి. అయితే, ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ఎవరూ అధికారంగా చెప్పలేదు. తాజాగా అదితి గ్రాడ్యుయేషన్‌సందర్భంగా జై కోటక్ చేసిన ట్వీట్‌తో ఊహించనట్టుగానే క్లారిటీ వచ్చింది. కాగా, ఈ ట్వీట్‌పై వ్యాపార వేత్త హర్ష్ గొయెంకా సహా పలువురు రియాక్ట్ అయ్యారు. త్వరలో ఈ కపుల్ ఒక్కటవ్వాలని ఆకాంక్షించారు.
జై కోటక్ కొలంబియా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అనంతరం హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో ఎంబీఏ పూర్తి చేశారు. ప్రస్తుతం కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు చెందిన డిజిటల్ ఫస్ట్ మొబైల్ బ్యాంక్ కోటక్ 811 కి వైస్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు.
‘ఇజం’ తో తెలుగులో
ఇక అదితి ఆర్య ఢిల్లీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. గతలో ఎర్నెస్ట్ అండ్ ఎంగ్ అనే ప్రొఫెషనల్ సర్వీస్ నెట్‌వర్క్‌లో రీసెర్చి అనలిస్ట్‌గా కొన్నాళ్లు పనిచేసింది. 2015 లో ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని దక్కించుకున్నారు. అదితి ఆర్య తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. తెలుగులో పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో కల్యాణ్ రామ్ హీరోగా వచ్చిన ‘ఇజం’లో నటించింది. అలాగే, రణ్‌వీర్ సింగ్ నటించిన ‘83’ సహా పలు హిందీ చిత్రాల్లో కూడా యాక్ట్ చేసింది. తాజాగా అమెరికాలోని యేల్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుంది అదితి.