Site icon Prime9

Karvy Stock Broking: కార్వీ మాజీ ఉద్యోగులకు షాక్ ఇచ్చిన సెబీ

Karvy

Karvy

Karvy: కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌ (కేఎస్‌బీఎల్‌) ఖాతాదారుల నిధులను దుర్వినియోగం చేసిన కేసులో కార్వీ గ్రూప్ కు చెందిన నలుగురు మాజీ అధికారులపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా) రూ. 1.9 కోట్ల జరిమానా విధించింది. జరిమానా మొత్తాన్ని 45 రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది. వీరిలో కార్వీ మాజీ వైస్‌ ప్రెసిడెంట్‌ జి. కృష్ణ హరి, కాంప్లియెన్స్‌ ఆఫీసర్‌ శ్రీకృష్ణ గురజాడ, బ్యాక్‌ ఆఫీస్‌ ఆపరేషన్స్‌ జనరల్ మేనేజర్ జీఎం శ్రీనివాస రాజు, కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ అనుబంధ కంపెనీ కేడీఎంఎస్‌ఎల్‌ ఎండీ వి. మహేశ్‌ ఉన్నారు.

 

ఉన్నతాధికారులు చేసిన తప్పులే(Karvy Stock Broking)

మదుపురులకు చెందిన షేర్లను బ్యాంకుల్లో తనఖా పెట్టి తెచ్చిన అప్పును ఇతర సంస్థలకు మళ్లించడం, ఆ సొమ్మును తిరిగి బ్యాంకులకు చెల్లించకపోవడంతో కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ ఇప్పటికే సెబీ పలు రకాల చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. సంస్థ సీఎండీ, ఇద్దరు బోర్డు డైరెక్టర్లకు జరిమానా విధించడంతో పాటు సీఎండీని సెక్యూరిటీస్ కంపెనీ చేసిన తప్పులకు సహకరించిన, కుమ్మక్కైన కేఎస్‌బీఎల్‌కు చెందిన కీలక వ్యక్తులపై సెబీ న్యాయ విచారణను ప్రారంభించింది.

దీని తర్వాత ఈ ఉత్తర్వులు వెలువడడం గమనార్హం. కేఎస్ బీఎల్ మదుపర్లు నష్టపోవడానికి ఈ ఉన్నతాధికారులు చేసిన తప్పులే కారణమని సెబీ పేర్కొంది. అందువల్ల జి. కృష్ణ హరికి రూ. 1 కోటి పెనాల్టి విధిస్తున్నట్టు సెబీ పేర్కొంది. శ్రీనివాస రాజు రూ. 40 లక్షలు, శ్రీ కృష్ణ గురజాడ రూ. 30 లక్షలు, వి మహేష్ రూ. 20 లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.

 

Exit mobile version
Skip to toolbar