Site icon Prime9

iPhone 13 And iPhone 12: ఐఫోన్ 12, ఐఫోన్ 13 ధరలు ఇంత భారీగా తగ్గాయా?

iphone 13 prime9news

iphone 13 prime9news

Apple iPhone 13, iPhone 12: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో సేల్స్ సందడి మొదలైంది. ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్‌ సంధర్బంగా యాపిల్ ఐఫోన్స్ పై ధరలు ఆఫర్లు భారీగా తగ్గాయి. ఇది వరకు ఐఫోన్ కొనాలంటే ముందు,వెనుక ఆలోచించేవారు. ఇప్పుడు అందరూ చాలా తేలికగా కొనుక్కుంటున్నారు. దీనిలో ముఖ్యంగా ఐఫోన్ 13 , ఐఫోన్ 12 ఫోన్ల పై ధరలు మనం కొనుగోలు చేసే విధంగా ఉన్నాయి.

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 13 ఫోన్ తగ్గిన ధర ఈ విధంగా ఉంది..
ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్‌ సంధర్బంగా ఐఫోన్ 13 ఈ ధరకు మనకు అందుబాటులో ఉండనుంది. ఐఫోన్ 13 ఫోన్ 128gb ధర రూ.69,900 ఉండగా ఈ సేల్‌లో రూ.54,990 గా మనకి అందుబాటులో ఉండనుంది. అంటే అక్షరాల 21శాతం డిస్కౌంట్ వరకు తగ్గింది. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసేవారికి రూ.3,000 అదనపు డిస్కౌంట్ ఉంటుంది. అంటే రూ.51,990కే ఐఫోన్ 13ను మనం కొనుగోలు చేయవచ్చు.

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 12 ఫోన్ తగ్గిన ధర ఈ విధంగా ఉంది..
ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్‌ సంధర్బంగా ఐఫోన్ 12 ఈ ధరకు మనకు అందుబాటులో ఉండనుంది. ఐఫోన్ 12 64gb ధర రూ.52,999 ఉండగా ఈ సేల్‌లో రూ.42,999 గా మనకి అందుబాటులో ఉండనుంది.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసేవారికి రూ.1,250 అదనపు డిస్కౌంట్ ఉంటుంది.

Exit mobile version