Site icon Prime9

Infinix Zero 55 Inch QLED 4K Smart TV: ఇన్ఫినిక్స్ సంస్థవారు విడుదల చేసిన కొత్త టీవి వివరాలు ఇవే!

smart tv prime9news

smart tv prime9news

Infinix Zero 55 Inch QLED 4K Smart TV: స్మార్ట్‌ టీవీలను లాంచ్ చేసిన ఇన్ఫినిక్స్ ప్రీమియమ్ లోకి అడుగుపెట్టింది. ఇన్ఫినిక్స్ సంస్థ వారు 55 ఇంచుల డిస్‌ప్లే కలిగి ఉన్న ప్రీమియమ్ ఆండ్రాయిడ్‌ స్మార్ట్ టీవీని లాంచ్ చేశారు. డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్, HDR 10+ సపోర్ట్‌తో ఈ టీవీ మన ముందుకు రాబోతుంది. బెజిల్‌లెస్ డిజైన్‌తో లుక్ తో ఉంది. ఇన్ఫినిక్స్ జీరో 55 ఇంచ్ QLED 4K స్మార్ట్ టీవీల ధర,స్పెసిఫికేషన్ల వివరాలు కింద తెలుకుందాం.

ఇన్ఫినిక్స్ జీరో 55 ఇంచ్ QLED 4K స్మార్ట్ టీవీ స్పెసిఫికేషన్లు..

4K రెజల్యూషన్ ఉండే ఈ స్మార్ట్ టీవి 55 ఇంచుల QLED డిస్‌ప్లేను ఈ స్మార్ట్ టీవీ కలిగి ఉంది. డాల్బీ విజన్, HDR 10+ సపోర్ట్, 60Hz రిఫ్రెష్ సపోర్ట్ కూడా ఈ టీవికి అమరి ఉంటుంది. పీక్ ‌బ్రైట్‌నెస్ 400 నిట్స్ వరకు ఉంటుంది. పిక్చర్ క్వాలిటీ హై గా ఉండటానికి క్వాంటమ్ డాట్ Display ఇస్తున్నట్టు ఇన్ఫినిక్స్ సంస్థ వారు పేర్కొన్నారు. క్వాడ్‌కోర్ మీడియాటెక్ Ca55 ప్రాసెసర్‌ పై ఈ స్మార్ట్ టీవీ రన్ అవుతుంది. 2GB Ram, 16GB, ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఈ ఇన్ఫినిక్స్ ప్రీమియమ్ స్మార్ట్ టీవీ మన ముందుకు రాబోతుంది.

ఆండ్రాయిడ్‌ 11 టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఇన్ఫినిక్స్ జీరో 55 ఇంచ్ QLED 4K స్మార్ట్ టీవీ రాబోతుంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో,Disney plus హాట్‌స్టార్‌తో పాటు పాపులర్ ఓటీటీ యాప్స్ అన్నింటికీ ఈ స్మార్ట్ టీవీ సపోర్ట్ చేస్తుంది. యాప్స్, గేమ్స్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది.గూగుల్ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్లు కూడా మనకి అందుబాటులో ఉంటాయి.

ఇన్ఫినిక్స్ జీరో 55 ఇంచ్ QLED 4K స్మార్ట్ టీవీ ధర..
ఇన్ఫినిక్స్ జీరో 55 ఇంచుల QLED 4K స్మార్ట్ టీవీ ధర రూ.34,990 గా ఉంది. సెప్టెంబర్ 22నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్ టీవి మనకి అందుబాటులో ఉంటుంది.

Exit mobile version