Site icon Prime9

Festive sale: 4 రోజుల్లో రూ.11,000 కోట్ల విలువైన మొబైల్ ఫోన్‌లను విక్రయించిన ఈ-కామర్స్ సంస్థలు

mobile phones

mobile phones

E-commerce firms: నవరాత్రుల సందర్బంగా  పండుగ సీజన్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. భారతదేశంలోని ఇ-కామర్స్ సంస్థలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మీషో తదితర సంస్దలకు ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. కన్సల్టింగ్ సంస్థ రెడ్‌సీర్ నివేదిక ప్రకారం, ఈ సంవత్సరం నవరాత్రులమొదటి నాలుగు రోజుల్లో, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు నిమిషానికి 1,100 మొబైల్ ఫోన్‌లను విక్రయించాయి.

4 రోజులలో దాదాపు 60-70 లక్షల మొబైల్‌లు అమ్ముడయ్యాయి. ఐఫోన్ 12, 13 మరియు వన్‌ప్లస్ మోడల్స్ వంటి ప్రీమియం ఫోన్‌లు పెద్ద ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో మొబైల్ అమ్మకాలను పెంచాయని రెడ్‌సీర్ తన నివేదికలో పేర్కొంది. ఈ కేటగిరీ నుండి మొత్తం రూ. 11,000 కోట్ల అమ్మకాలు జరిగాయి. నాలుగు రోజుల్లో రోజువారీ సగటు రూ. 5,500 కోట్ల విలువైన అమ్మకాలు సాగాయి. టార్గెటెడ్ కస్టమర్ కోసం కొత్త వాణిజ్యం మరియు క్యూరేటెడ్ ఆఫర్‌లను స్వీకరించడం ద్వారా టైర్ 2+ నగరాల్లో వృద్ధి ఉందని తెలిపింది. మొత్తంమీద, ఇ-కామర్స్ పోర్టల్‌ల రోజువారీ సగటు ఈ పండుగ కాలంలో 5.4 రెట్లు పెరిగింది. దేశవ్యాప్తంగా దాదాపు 50-55 మిలియన్ల మంది ఆన్‌లైన్ షాపర్లు కొనుగోళ్లు చేశారు. E-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు రూ. 24,500 కోట్లు లేదా $3.5 బిలియన్ల అమ్మకాలను సాధించాయి. గత ఏడాది కంటే ఇవి చాలా ఎక్కువ అని రెడ్‌సీర్ పేర్కొంది.

మొదటి రౌండ్ పండుగ విక్రయాలలో ఫ్లిప్‌కార్ట్ యొక్క ‘బిగ్ బిలియన్ డే సేల్’, అమెజాన్ యొక్క ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’, మీషో యొక్క ‘మెగా బ్లాక్‌బస్టర్ సేల్’ మరియు Nykaa, Myntra మరియు Ajio వంటి ఫ్యాషన్ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి.

Exit mobile version
Skip to toolbar