Site icon Prime9

GST collections: జూలై లో జీఎస్టీ వసూళ్లు రూ. 1.65 లక్షల కోట్లు..

GST collections

GST collections

GST collections:జూలై 2023 వస్తు, సేవల పన్ను (GST) ఆదాయం వసూళ్లు రూ. 165,105 కోట్లు గా ఉన్నాయి. 2022లో అదే నెలలో నమోదైన దానికంటే జూలై లో జీఎస్‌టీ ఆదాయం 11 శాతం ఎక్కువ.ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం , జూలైలో మొత్తం జీఎస్టీ వసూళ్లలో, సీజీఎస్టీ రూ.29,773 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.37,623 కోట్లు, ఐజీఎస్టీ రూ.85,930 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన రూ. 41,239 కోట్లతో కలిపి) మరియు సెస్సు రూ.11,779 కోట్లు. (వస్తువుల దిగుమతిపై వసూలు చేసిన రూ. 840 కోట్లతో సహా)

ఏప్రిల్ లో అత్యధికంగా..(GST collections)

ఈ ఏడాది ఏప్రిల్‌లో జిఎస్‌టి వసూళ్లు ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయి రూ.187,035 కోట్లకు చేరుకోవడం గమనార్హం. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం స్థూల జీఎస్టీ వసూళ్లు రూ. 18.10 లక్షల కోట్లు. సగటు స్థూల నెలవారీ వసూళ్లు రూ. 1.51 లక్షల కోట్లు. 2022-23లో స్థూల రాబడులు మునుపటి సంవత్సరం కంటే 22% ఎక్కువ.

గత కొన్ని సంవత్సరాలుగా, పన్ను వసూళ్లను పెంచడానికి  వివిధ ప్రయత్నాలు చేయబడ్డాయి. జూలై 1, 2017 నుండి దేశంలో వస్తు మరియు సేవల పన్ను అమలులోకి వచ్చింది. జీఎస్టీ (రాష్ట్రాలకు పరిహారం) చట్టం, 2017లోని నిబంధనల ప్రకారం జీఎస్టీ అమలు కారణంగా ఉత్పన్నమయ్యే ఏదైనా ఆదాయ నష్టానికి రాష్ట్రాలకు ఐదు సంవత్సరాల కాలానికి పరిహారం కూడా ఇస్తామని కేంద్రం చెప్పింది.

Exit mobile version