Site icon Prime9

GST collection: జూన్‌లో రూ. 1.61 లక్షల కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు

GST

GST

 GST collection: దేశంలో మరోసారి వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు భారీగా నమోదయ్యాయి. జూన్‌ నెల వసూళ్లు 1 లక్ష 61 వేల497 కోట్లని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందులో సీజీఎస్టీ రూపంలో 31వేల 013 కోట్లు, ఎస్‌జీఎస్టీ కింద 38వేల 292 కోట్లు, ఐజీఎస్టీ కింద 80వేల 292 కోట్లు చొప్పున వసూలైనట్లు వెల్లడించింది.

12 శాతం పెరుగుదల..( GST collection)

గత ఏడాది జూన్‌లో 1 లక్ష 44 వేల కోట్లు వసూళ్లు నమోదవ్వగా.. ఈ ఏడాది వసూళ్లు 12 శాతం మేర పెరిగాయి. అలాగే, జీఎస్టీ వసూళ్లు 1.60 లక్షల కోట్ల మార్కు దాటడం ఇది నాలుగోసారి. 2021-22లో తొలి త్రైమాసికంలో జీఎస్టీ సగటు వసూళ్లు 1.10 లక్షల కోట్లు ఉండగా.. 2022-23 తొలి త్రైమాసికానికి 1.51 లక్షల కోట్లకు, 2023-24 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 1.69 లక్షల కోట్లకు పెరిగినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. జీఎస్టి వసూళ్లలో ఎప్పటిలానే మహారాష్ట్ర 26వేల098.78 కోట్ల వసూళ్లతో అగ్రస్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోల్చుకుంటే 17 శాతం వృద్ది కనిపించింది.

Exit mobile version