Gold and Silver Prices Today: మహిళలకు బంగారం అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా పెళ్లి సీజన్‌లో మహిళలు బంగారం కొనుగోళ్లు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తారు. వివాహ వేడుకులకు హాజరయ్యేందుకు బంగారాన్ని ధరించి వెళ్లడం సంప్రదాయంగా పరిగణిస్తారు. ప్రతీ ఏడాది ఎంతో కొంత కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తారు. ప్రస్తుతం బంగారం తులం 97వేలకు చేరింది. అయితే నిత్యం బంగారం ధరలు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి.
తాజాగా, బంగారం ధరలు స్వల్పంగా పెరిగింది. రెండు రోజుల క్రితం బంగారం ధరలు తగ్గగా.. ఇవాళ మరోసారి పెరిగాయి. దీంతో మహిళలు బంగారాన్ని కొనుగోలు చేసేందుకు జంకుతున్నారు. కొంతమంది కొనుగోలు చేసేందుకు వెళ్తున్నారు. మరింత పెరిగే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ప్రపంచంలో మనదేశంలోనే మహిళలు బంగారం ఎక్కువగా ధరిస్తుంటారు. దేశవ్యాప్తంగా మహిళలు సుమారు 24వేల టన్నుల బంగారం కలిగి ఉన్నారంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇక, బంగారం ధరల విషయానికొస్తే.. ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకు బంగారు స్టోరేజ్, వడ్డీ రేట్లపై బంగారం ధరలు ఆధారపడి ఉంటాయి. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.97,720గా ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.89,590గా ఉంది.
హైదరాబాద్ నగరంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.820 పెరిగింది. దీంతో రూ.98,400కు చేరగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.90,200గా ఉంది. ఏపీలోని విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, పొద్దుటూర వంటి ప్ధానం నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక, వెండి విషయానికొస్తే.. తెలుగు రాష్ట్రాల్లో కేజీపై రూ.100 పెరిగింది. దీంతో ప్రస్తుతం కేజీ వెండి రూ. 1,19,100 పలుకుతోంది.