Site icon Prime9

Gautam Adani Son: నిరాడంబరంగా అదానీ కొడుకు ఎంగేజ్మెంట్

Gautam Adani's son

Gautam Adani's son

Gautam Adani Son: దేశీయ ప్రముఖ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూపుల అధినేత గౌతమ్ అదానీ ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. అదానీ చిన్నకొడుకు జీత్ అదానీ ఓ ఇంటివాడు కాబోతున్నాడు.

ప్రముఖ వజ్రాల వ్యాపారి, దినేష్ అండ్ కో ప్రైవేట్ లిమిటెడ్ అధినేత దివా జైమిన్ షా కూతురు దివా జైమిన్ షాతో జీత్‌ అదానీకు నిశ్చితార్థం జరిగింది.

 

నిరాడంబరంగా వేడుక

కాగా, ఈ ఎంగేజ్‌మెంట్ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో మార్చి 12న ఆదివారం నిరాడంబరంగా జరిగినట్టు తెలుస్తోంది.

ఈ వేడుకకు అత్యంత సన్నిహిత స్నేహితులు, బంధువులు కొద్దిమంది మాత్రమే హాజరయ్యారని సమాచారం.

ఈ కార్యక్రమం ప్రైవేటు వేడుక కావడంతో పెద్దగా వివరాలు తెలియరాలేదు.

అయితే నిశ్చాతార్థినికి సంబంధించి ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ఫొటో లో కాబోయే దంపతులిద్దరూ సంప్రదాయ దుస్తులు ధరించి చూడముచ్చటగా ఉన్నారు.

ఎంబ్రాయిడరీ లెహంగా, లేత నీలి రంగు దుపట్టాలో దివా మెరిసిపోతుండగా.. జీత్ అదానీ కూడా అదే రంగు దుస్తులను ధరించాడు.

లేత నీలి కుర్తాతో ఎంబ్రాయిడరీ జాకెట్‌‌తో ఆకట్టుకుంటున్నాడు.

 

సీఎఫ్ వో గా అడుగుపెట్టి..(Gautam Adani Son)

కాగా జీత్ అదానీ అమెరికాలోని ‘యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ అప్లైయిడ్ సైన్సెస్’లో ఇంజనీరింగ్ అండ్ అప్లైడ్ సైన్సెస్ లో పట్టా పొందారు.

2019లో అదానీ గ్రూపులో సీఎఫ్ వో గా అడుగుపెట్టారు. ప్రస్తుతం గ్రూప్ ఫైనాన్స్ వైస్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.

ఆయన స్ట్రాటజిక్ ఫైనాన్స్, క్యాపిటల్ మార్కెట్స్, రీస్క్ అండ్ గవర్నెన్స్ పాలసీపై దృష్టిసారించారని అదానీ గ్రూప్ వెబ్‌సైట్ పేర్కొంది.

ఇక అదానీ ఎయిర్‌పోర్ట్స్ బిజినెస్‌తో పాటు అదానీ డిజిటల్ ల్యాబ్స్ వ్యాపారాలు కూడా ఆయన సారధ్యంలోనే కొనసాగుతున్నాయి.

అదానీ గ్రూప్ వ్యాపారాల వినియోగదారుల కోసం ఒక సూపర్ యాప్‌ను రూపొందించబోతున్నట్టు వివరించింది. కాగా గౌతమ్ అదానీ పెద్ద కొడుకు ప్రసిద్ధి ష్రోఫ్‌కు ఇదివరకే పెళ్లయ్యింది.

దివా బ్యాగ్రౌండ్ ఇదే..

దివా బ్యాగ్రౌండ్ విషయానికి వస్తే.. వజ్రాల వ్యాపారానికి చెందిన సంపన్న కుటుంబానికి చెందిన యువతిగా తెలుస్తోంది.

ఆమె తండ్రి జైమిన్ షా.. సీ దినేష్ అండ్ కో-ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ యజమానిగా ఉన్నారు.

ఈ కంపెనీ ముంబై, సూరత్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కంపెనీ ప్రస్తుత డైకెర్టర్లలో జైమిన్ షా కూడా ఉన్నారు.

 

Exit mobile version