Site icon Prime9

Gautam Adani-Mukesh Ambani: భారీగా సంపద కోల్పోయిన అదానీ, అంబానీలు

adani-ambani

adani-ambani

Gautam Adani-Mukesh Ambani: లోకసభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో స్టాక్‌ మార్కెట్లు మంగళవారం నాడు కుప్పకూలాయి. ఇండియాలో అత్యంత సంపన్నులు గౌతమ్‌ అదానీ, ముఖేష్‌ అంబానీలు బిలియన్‌ల కొద్ది డాలర్ల సంపద కోల్పోయారు. గత నాలుగేళ్లలో స్టాక్‌మార్కెట్లు ఈ స్థాయిలో క్షీణించిన దాఖలాల్లేవు. అయితే ఎగ్జిట్‌ పోల్స్‌లో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ వస్తుందన్న ప్రకటనలు వచ్చిన వెంటనే సోమవారం నాడు స్టాక్‌ మార్కెట్లు ఆకాశమే హద్దుగా దూసుకుపోయాయి. అటు తర్వాత మంగళవారం నాడు బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో స్టాక్‌ మార్కెట్లు ప్రకంపనలు సృష్టించాయి. గౌతమ్‌ అదానీ గ్రూపునకు చెందిన షేర్లు భారీగా నష్టపోయాయి. అదానీ గ్రూపు మార్కెట్‌ విలువ సుమారు 25 బిలియన్‌ డాలర్ల వరకు నష్టపోయింది.

బుధవారం కోలుకున్న మార్కెట్లు..(Gautam Adani-Mukesh Ambani)

కాగా బుధవారం నాడు స్టాక్‌ మార్కెట్లు కాస్తా కోలుకున్నాయి. సెన్సెక్స్‌ 1,000 పాయింట్లు కోలుకోగా.. నిఫ్టీ 500 పాయింట్ల వరకు లాభపడింది. మొత్తానికి చూస్తే అదానీ గ్రూపు చైర్మన్‌ గౌతమ్‌ అదానీ నికర విలువ 24.9 బిలియన్‌ డాలర్లు క్షీణించి బుధవారానికి 97.5 బిలియన్‌ డాలర్లకు దిగివచ్చిందని బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్‌ ఇండెక్స్‌ వెల్లడించింది. కాగా గౌతమ్‌ అదానీ ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో 15వ స్థానంలో నిలిచారు. ఇక ఇండియాలో ఆయన ముఖేష్‌ అంబానీ తర్వాత స్థానంలో అంటే రెండవ స్థానంలో నిలిచారు. లోకసభ ఫలితాలు వెలువడిన మంగళవారం రోజు అదానీ గ్రూపు షేర్లు 18 శాతం వరకు క్షీణించాయి. దీంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లో అంబానీ గ్రూపునకు చెందిన షేర్లు మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ 10 లక్షల కోట్ల వరకు ఆవిరయ్యింది.

ఇక రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ చైర్మన్‌ ముఖేష్‌ అంబానీ విషయానికి వస్తే ఆయన నికర విలువ 8.99 బిలియన్‌ డాలర్లు క్షీణించింది. ప్రస్తుతం ఆయన సంపద 106 బిలియన్‌ డాలర్లుగా తేలింది. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో ఆయన 11వ స్థానంలో నిలిచారు. మంగళవారం నాడు స్టాక్‌ మార్కెట్లో ముఖేష్‌ అంబానీకి చెందిన కంపెనీ షేర్లు కూడా భారీగా నష్టపోయాయి. కాగా బుధవారం నాడు స్టాక్‌ మార్కెట్లు తిరిగి కోలుకున్నాయి. రిలయన్స్‌ షేర్లు కూడా స్వల్పంగా లాభపడ్డాయి.

 

Exit mobile version