Prime9

Farmers Pension Scheme(PM- KMY): రైతులకు అద్భుత అవకాశం.. ప్రతినెల రూ.55 డిపాజిట్ చేస్తే చాలు.. నెలకు రూ. 3వేలు పెన్షన్!

Farmers Pension Scheme – Pradhan Mantri Kisan Maandhan Yojana: కేంద్ర ప్రభుత్వం పేదల కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఆరుగాలం శ్రమిస్తున్న రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన స్కీమ్ తీసుకొచ్చింది. ఈ స్కీమ్ కింద సన్నకారు, చిన్న రైతులకు ప్రతి నెలా పింఛన్ పొందే అవకాశం ఉంటుంది.

 

ప్రతినెలా రూ.3వేలు..

ఈ పథకం కింద పెట్టుబడి పెట్టేందుకు రైతుల వయస్సు 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ స్కీమ్ కింద రైతులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు.  అయితే పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు. రైతు వయస్సు 60 ఏళ్లు నిండిన తర్వాత ప్రతి నెలా రూ.3వేల పింఛన్ అందుతుంది.

 

ప్రీమియం ఎంతంటే..?

ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ స్కీమ్ కింద చేరిన రైతులు 60 ఏళ్ల వరకు ప్రతి నెలా రూ.55 నుంచి రూ.200 వరకు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇలా 60 ఏళ్ల వరకు డిపాజిట్ చేసిన వ్యక్తులకు 60 ఏళ్లు నిండిన తర్వాత ప్రతి నెలా రూ.3వేలు అందుతాయి. ఒకవేళ 60 ఏళ్ల లోపు రైతు మరణిస్తే.. అతని భార్య పేరు మీద ఈ పథకం కంటిన్యూ అవుతోంది. ప్రతి నెలా ఆమెకు రూ.1500 పింఛన్ అందుతుది.

 

దరఖాస్తు చేసుకోండిలా..?

Exit mobile version
Skip to toolbar