Site icon Prime9

Tata Tiago EV: టాటా నుంచి కొత్త ఎలక్ట్రిక్ కారు విడుదల

Tata-Tiago-EV

Tata Motors electric cars: టాటా మోటార్స్ దేశంలోనే అత్యంత తక్కువ ఖరీదైన ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది రెండు రకాల బ్యాటరీ ప్యాక్‌లతో మన ముందుకు రానుంది. ఈ కారు ధర రూ.8.49 లక్షల నుంచి రూ.11.79 లక్షలుగా ఉంది. ఇది మీరు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 315 కిలో మీటర్ల వరకు దీనిలో ప్రయాణం చేయవచ్చు. Tiago EVలో బుకింగ్స్ ఈ నెల అక్టోబర్ 10 నుండి మొదలు కానున్నాయి. ఈ కారు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ క్రూయిజ్ తో ఆటోమేటిక్ గా కంట్రోల్‌ అవుతుంది. ఇంకా ఈ కారుకు సంబంధించిన బెస్టు స్పెసిఫికేషన్ల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

Tiago EVలో మీరు మీ ఫోన్‌లో చూడగలిగే అనేక ఫీచర్లు ఈ ఎలక్ట్రిక్ కారులో ఉన్నాయి. రిమోట్ వెహికల్ హెల్త్ డయాగ్నోస్టిక్స్ రియల్ టైమ్ ఛార్జ్ సిస్టమ్‌లో డైనమిక్ ఛార్జర్ లొకేటర్, డ్రైవింగ్ స్టైల్ అనలిటిక్స్ దీనిలో అమరి ఉన్నాయి. ఈ కారు 5.7 సెకన్లలో 0 వేగం నుంచి 60 mph వేగాన్ని చేరుకుంటుందని టాటా సంస్థ వారు పేర్కొన్నారు. దీని 15A సాకెట్‌ను 3.3kW AC ఛార్జర్, 7.2kW AC హోమ్ ఛార్జర్ మరియు DC ఛార్జర్ ద్వారా దీన్ని ఛార్జ్ చేయవచ్చు.

ఈ ఎలక్ట్రిక్ కారు మొత్తం ఐదు రంగులలో మన ముందుకు రానుంది. అవి టీల్ బ్లూ, డేటోనా గ్రే, ప్రిస్టైన్ వైట్, మిడ్‌నైట్ ప్లం, ట్రాపికల్ మిస్ట్ లో మనకి అందుబాటులో ఉంది.

ఇదీ  చదవండి : ఈ స్మార్ట్ ఫోన్ కొనుక్కుంటే ఈ స్మార్ట్ వాచ్ ఫ్రీ !

Exit mobile version