Site icon Prime9

Electric Bike deal: ఇ-కామర్స్ సంస్ధ అమెజాన్ డెలివరీలో విద్యుత్ వాహనాలు.. టివిఎస్ తో ఒప్పందం

E-commerce firm Amazon has signed an agreement with TVS to use electric vehicles in its delivery

Amazon India-TVS Motor Company: ప్రముఖ ఇ-కామర్స్ సంస్ధ అమెజాన్ తన వస్తువుల డెలివరీలో విద్యుత్ వాహనాలను వినియోగించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ప్రముఖ మోటారు కంపెనీ టివిఎస్ తో ఒప్పందం కుదుర్చుకుంది. వినియోగదారులకు వస్తువులను డెలివరీలో రెండు, మూడు చక్రాల వాహనాలను వినియోగించనున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణం పై కీలక దృష్టిని సాగించిన క్రమంలో దిగ్గజ అమెజాన్ కూడా ఆ దిశలో నడవడం గమనార్హం. రానున్న మూడేళ్లలో 10వేల విద్యుత్ వాహనాలను వినియోగించడమే సంస్ధ లక్ష్యంగా అమెజాన్ డైరెక్టర్ అభినవ్ సింగ్ పేర్కొన్నారు. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలనే క్రమంలో ప్రముఖ మోటారు కంపెనీ టివిఎస్ ను ఎంచుకొన్నామన్నారు. 2030కి చేరుకొనే సమయంలో దాదాపుగా లక్ష విద్యుత్ వాహనాలను అమెజాన్ వినియోగించే అవకాశం ఉందన్నారు.

టివిఎస్ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ బైక్ ఐ క్యూబ్ మార్కెట్టులో మంచి పేరును సంపాదించుకొనింది. ఈ విజయంతో ఐక్యూబ్ ఎలక్ట్రిక్ విద్యుత్ స్కూటర్ పరిధిని వాణిజ్య అవసరాలకు సైతం వినియోగించడానికి తాజా ఒప్పందం ఉపయోగపడుతుందని టీవిఎస్ ప్రతినిధి మను సక్సేనా పేర్కొన్నారు. దీంతో పాటుగా ప్రస్తుతం నిర్వహిస్తున్న అమెజాన్ వ్యాపార విభాగాల్లో విద్యుత్ వాహనాల అవసరాన్ని కూడా ఇరు కంపెనీలు పరిశీలించనున్నాయి.

ప్రస్తుతం ఐ క్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటరు మార్కెట్టులో మూడు మోడల్స్ లో లభ్యమవుతుంది. ఒక్కొక్క వాహనం ఖరీదు రూ. 1.25లక్షల నుండి రూ. 1.61 లక్షల వరకు ఉంది. వినియోగదారులు కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ కంపెనీల మద్య కుదిరిన ఒప్పందం విద్యుత్ వాహనాల వినియోగానికి మరింత బలం చేకూరనుంది.

ఇది కూడా చదవండి: Central government: ట్విట్టర్‌లో ఉద్యోగుల కోత సరికాదు.. కేంద్ర ప్రభుత్వం

Exit mobile version