Divis q4 Results: హైదరాబాద్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఫార్మా దిగ్గజం దివీస్ లేబరేటరీస్ మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఫలితాలు రికార్డు బద్దలు కొట్టింది. కాగా ఫార్మా దిగ్గజం మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత నికరలాభం ఏకంగా 67.6 శాతం పెరిగి రూ.538 కోట్లకు ఎగబాకింది. అదే సమయంలో రెవిన్యూ కూడా 18.04 శాతం పెరిగి రూ.2,303 కోట్లు చేరింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో పన్ను చెల్లించడానికి ముందు నికరలాభం రూ.713 కోట్లు కాగా … క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.466 కోట్లతో పోల్చుకుంటే 53 శాతం వృద్ధి కనిపించింది.
రూ.561 కోట్లకు చేరిన లాభం..(Divis q4 Results)
ఇక కంపెనీ మొత్తం వ్యయం ఏడాది ప్రాతిపదికన చూస్తే క్యూ4లో 7.61 శాతం పెరిగి రూ.1,669 కోట్లకు ఎగబాకింది. ముడి సరకుల వ్యయం రూ.898 కోట్లు. క్రితం ఏడాదితో పోల్చుకుంటే 11.14 శాతం పెరరిగింది. ఇక ఉద్యోగుల జీత భత్యాలు రూ.297 కోట్లు. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చుకుంటే 15.12 శాతం పెరుగుదల కనిపించింది. స్టాండ్ ఎలోన్ ప్రాతిపదికన చూస్తే కంపెనీ నికరలాభం ఏకంగా 66.46 శాతం పెరిగి రూ.561 కోట్లకు ఎగబాకింది. ఇక రెవిన్యూ విషయానకి వస్తే 18.4 శాతం పెరిగి రూ.2,259 కోట్లు చేరింది. ఇక కంపెనీకి మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఫారెక్స్ నష్టాలు వెంటాడాయి. మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.1 కోటి వరకు నష్టపోయింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.3కోట్ల వరకు ఫారెక్స్ నష్టాలను చవిచూసింది. ఇక ఆర్థిక సంవత్సరం మొత్తానికి చూస్తే కంపెనీ ఏకీకృత నికరలాభం 12.28 శాతం క్షీణించి రూ.1,600 కోట్లకు దిగివచ్చింది. రెవిన్యూ విషయానికి వస్తే క్యూ4లో స్వల్పంగా పెరిగి రూ.7,845 కోట్లకు చేరింది. కిత్రం ఏడాదిఇదే కాలంలో రూ.7,767గా నమోదైంది. కాగా కంపెనీ బోర్డు తుది డివిడెండ్ .. 2023-24 ఆర్థిక సంవత్సరానికి షేరుకు రూ.30 డివిడెండ్‌గా ప్రకటించింది. డివిడెండ్ రికార్డు డేట్‌ను ఆగస్టు 2, 2024గా నిర్ణయించింది.