Prime9

8th Pay Commission January 2026: గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. భారీ జీతాల పెంపు జనవరి నుంచి అమల్లోకి!

Central Government Employees 8th Pay Commission January 2026: ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. 8వ వేతన కమిషన్‌ను వచ్చే ఏడాది జనవరి నుంచి అమలులోకి రానుందని కమిషన్ ప్రకటించింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతభత్యాలు, పెన్షన్లకు లాభం చేకూరనుంది. కమిషన్ తీసుకున్న ఈ నిర్ణయంతో సుమారు 50 లక్షల ఉద్యోగులు, 65 లక్షల పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. కాగా, ఈ కమిషన్ సిఫార్సులు వచ్చే ఏడాది జనవరి నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రకటించింది.

 

అయితే ఎన్‌సీజేసీఎం సిఫార్సు చేసిన వాటిలో 2.86 ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ ప్రకారం.. కనీస ఇన్‌కమ్ రూ.18వేల నుంచి రూ.51వేల 480కు పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా, కనీస పెన్షన్ సైతం రూ.9వేల నుంచి రూ.25వేల 740కు పెరిగే ఛాన్స్ ఉంది. ఇందులో గ్రూపు ఏ, గ్రూపు బీ, సీ, డీ ఎంప్లాయిస్‌కు కమిషన్ కింద హెల్త్ ఇన్సూరెన్స్‌ను సైతం సవరించే ఛాన్స్ ఉంది.

 

ఇదిలా ఉండగా, 8వ వేతన కమిషన్ కింద ప్రభుత్వ ఉద్యోగుల జీతాల విషయంలో చాలా మార్పులు వస్తున్నాయి. జీతం పెంపు తో పాటు హెచ్ఆర్ఏ, టీఏ, ఇతర అలవెన్స్‌లు రవాణాను అనుసరించి మార్పులు చేస్తున్నారు.

 

ఉద్యోగుల జీతం నుంచి ఎన్‌పీఎస్ కింద డీఏలో 10 శాతం జమ అవుతుండగా.. ప్రభుత్వం 14 శాతం జమ చేస్తుంది. అయితే సవరణల తర్వాత ఈ విరాళాలు పెరగనున్నాయి. అలాగ సవరించిన జీతాల ఆధారంగా కేంద్ర ఆరోగ్య పథకం కింద ఛార్జీలు ఆధునీకరించే ఛాన్స్ ఉంది.

 

Exit mobile version
Skip to toolbar