Site icon Prime9

BSNL Best Offer: బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్

bsnl 2 prime9news

bsnl 2 prime9news

BSNL: తక్కువ ధరలో ప్రీపెయిడ్ సిమ్ ప్లాన్‌లు కావాలంటే బీఎస్ఎన్ఎల్‌ లో చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అందులో కొన్ని ప్లాన్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. ఐతే బీఎస్ఎన్ఎల్ 4జీ నెట్‌వర్క్ అందుబాటులో లేదు. ఒకవేళ మీరు ఉండే ప్రదేశంలో 3జీ నెట్‌వర్క్ ఉంటే బీఎస్ఎన్ఎల్ ప్లాన్స్‌ మంచిగా ఉన్నాయి. అలా తక్కువ ధరలోనే మంచి బెనిఫిట్స్‌తో వచ్చే ప్లాన్స్ వివరాలు ఇవే. రోజుకు రూ.5.70 ఖర్చుతో అన్‌లిమిటెడ్ బీఎస్ఎన్ఎల్ ప్లాన్ మన ముందుకు వచ్చింది. మరి ఆ ప్లాన్స్ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్..
రోజుకు సుమారు రూ.6.67 ఖర్చుతో 2gb డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, sms లు లభించే ఏకైక ప్లాన్ రూ.187.ఈ ప్లాన్ రూ.187 తో రీచార్జ్ చేసుకుంటే 28 రోజుల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. అలాగే ప్రతీ రోజు 2జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్, ప్రతీ రోజు 100sms లు ఉంటాయి. తక్కువ ధరలో ఎక్కువ డేటా కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఐతే బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ బెస్ట్‌గా ఉన్న ప్రదేశాల్లో ఈ ప్లాన్స్ మనకి ప్రయోజనకరంగా ఉంటాయి.

మరోవైపు బీఎస్ఎన్ఎల్ 4జీ లాంచ్ వచ్చే ఏడాదికి వాయిదా పడినట్టు తెలిసిన సమాచారం. ఈ ఏడాదిలో 4జీ నెట్‌వర్క్ మన ముందు తీసుకురావాలని బీఎస్ఎన్ఎల్ భావించినప్పటికీ కానీ సాధ్యం కాలేదు. ఇక దీంతో 2023లోనే సాధ్యమయ్యేలా కనిపిస్తుంది.

ఇదీ చదవండి : మోటో సంస్థ వారు విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ వివరాలు ఇవే!

Exit mobile version