Site icon Prime9

BoycottAmazon: ట్రెండ్ అవుతున్న #BoycottAmazon.. అమెజాన్ కు చైల్డ్ రైట్స్ ఫోరం సమన్లు

boycottAmazon tending news in social media

boycottAmazon tending news in social media

BoycottAmazon: దేశంలో మతమార్పిడిని ప్రోత్సహించే మిషనరీలకు అమెజాన్ ఇండియా నిధులు సమకూర్చుతుందనే ఆరోపణలపై నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ సమన్లు జారీ చేసింది. నవంబర్ 1న అమెజాన్ ఇండియా అధిపతి అమిత్ అగర్వాల్‎ను తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని కోరింది. మిషనరీలకు విరాళాలు అందించే విషయంపై సంస్థకు గతంలోనే నోటీసులు పంపినా అమెజాన్ సంస్థ స్పందించకపోవడంతో ‘చైల్డ్ రైట్స్ కమిషన్’ తీవ్ర ఆగ్రహానికి గురయ్యింది. దానితో సమన్లు పంపింది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా వేదికగా #BoycottAmazon అనే ట్యాగ్ ట్రెండింగ్ అవుతుంది. నిరుపేద కుటుంబాల స్థానిక చిరు వ్యాపారులకు అండగా ఉందాం.. ఆన్ లైన్ వస్తువుల కొనుగోలును దూరం పెట్టి ఈ దీపావళిని చేతి వృత్తుల వస్తువులతో ఆనందంగా జరుపుకుందాం.. చిరువ్యాపారాలను ఆదరిద్దాం అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెటుతున్నారు.

భారత్‎లోని పేదలకు సహాయం చేయడానికి విరాళాలు ఇవ్వండనే సారాంశంతో ‘ఆల్ ఇండియా మిషన్’ అనే ఓ క్రిష్టియన్ మిషనరీకి అమెజాన్ ఇండియా తన వెబ్‎సైట్‎లో నిధుల సేకరణ కోసం ఒక ప్రకటనను విడుదల చేసింది. అయితే ప్రకటనలో ఉన్న సంస్థ భారత్ లో భారీగా మతమార్పిడులకు పాల్పడుతోందని ‘సోషల్ జస్టిస్ ఫోరం ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్’ అనే సంస్థ ‘చైల్డ్ రైట్స్ ఫోరం’కు ఫిర్యాదు చేసింది.
ఇలా మతమార్పిడులకు పాల్పడుతున్న సంస్థకు అమెజాన్ ఇండియా తన వెబ్‎సైట్‎లో ప్రకటనల ద్వారా నిధులను సమకూర్చుడం ఏంటని కంప్లెయింట్‎లో పేర్కొంది. దీనితోపాటు ఈ నిధుల రూపంలో మనీలాండరింగ్ కూడా జరిగిందేమో అనే కోణంలో కూడా దర్యాప్తు చేయాలని సోషల్ జస్టిస్ అనే ఎన్జీవో NCPCR కోరింది.

ఈ ఫిర్యాదులపై స్పందించిన NCPCR, అమెజాన్ ఇండియాకు సెప్టెంబర్ 14న నోటీసులు పంపి ఏడు రోజులలోగా సమాధానం చెప్పాలని కోరింది. అయితే దానికి అమెజాన్ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడం వల్ల ఆగ్రహించిన NCPCR నవంబర్ 1న అమెజాన్ భారత్ విభాగానికి అధిపతి అయిన అమిత్ అగర్వాల్ తమ ముందు స్వయంగా హాజరయ్యి వివరణ ఇవ్వాలని సమన్ల ద్వారా హెచ్చరించింది.

ఇదీ చదవండి: అతి చేసిన గూగుల్.. రూ. 1,338 కోట్ల జరిమానా విధించిన సీసీఐ

Exit mobile version
Skip to toolbar