Site icon Prime9

Bisleri: యూత్ టార్కెట్ గా మూడు సరికొత్త ప్లేవర్స్ లాంచ్ చేసిన బిస్లరీ

Bisleri

Bisleri

Bisleri: బిస్లరీ పేరుతో ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ అందించే బిస్లరీ ఇంటర్నేషనల్‌ సంస్థ.. తాజాగా మూడు ఫ్లేవర్లలో సాఫ్ట్‌ డ్రింక్స్‌ను మార్కెట్ లో విడుదల చేసింది. ఆరెంజ్‌ ఫ్లేవర్‌లో ‘బిస్లరీ పాప్‌’, కోలా ఫ్లేవర్‌లో ‘బిస్లరీ రేవ్‌’, జీరా ఫ్లేవర్ లో ‘బిస్లరీ స్పైసీ జీరా’ లను తీసుకొచ్చింది. ఈ సరికొత్త ఉత్పత్తులను జనరేషన్‌ జెడ్‌ లక్ష్యంగా తీసుకొచ్చినట్టు కంపెనీ పేర్కొంది. ఈ కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకుని వెళ్లేందుకు డిజిటల్‌, సోషల్‌ మీడియా ప్లాట్ ఫామ్స్ తో పాటు రిటైల్‌, జనరల్‌ స్టోర్లను వినియోగించుకోనున్నట్టు బిస్లరీ తెలిపింది.

 

కొత్త రుచులను కోరుకునే వారి కోసం(Bisleri)

కాగా, బిస్లరీకి భారత మార్కెట్లో ఐకానిక్‌ ప్రొడెక్టులను తీసుకొచ్చిన చరిత్ర ఉందని బిస్లరీ ఇంటర్నేషనల్‌ వైస్‌ ఛైర్‌పర్సన్‌ జయంతి చౌహాన్ తెలిపారు. అదే లెగసీ ని కొనసాగించేందుకు కొత్త ఫ్లేవర్లలో కార్బొనేటెడ్‌ సాఫ్ట్‌ డ్రింక్స్‌ను తీసుకొచ్చామన్నారు. యువతే లక్ష్యంగా ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్ లో ప్రముఖ నటుల చేత ప్రచారం కూడా చేయిస్తున్నట్టు తెలిపారు. కొత్త రుచులను కోరుకునే యువతలో ఉత్పత్తులకు మంచి ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నామన్నారు. కొత్తగా వచ్చిన ప్లేవర్స్ 160 ml, 600 ml బాటిళ్లలో లభ్యం కానున్నాయి.

 

Exit mobile version